సీఎం కాదు కదా : చంద్రబాబు కాన్వాయ్ వెహికల్స్ తగ్గింపు

Submitted on 12 June 2019
Changes in Chandrababu Convoy

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ లో మార్పులు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఆయనకు.. వాహనాలను కుదించారు. కాన్వాయ్ లో రెండు వాహనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పైలెట్ క్లియరెన్స్ వాహనంతోపాటు ఎస్కార్ట్ వెహికిల్ ను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వ్యవహారాల కమిటీలో సమీక్ష నిర్వహించాకే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. 

ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. చంద్రబాబును టీడీపీ అధినేతగానే పరిగణించాల్సి ఉన్నా.. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీలో ఉన్నారు. దీంతో పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను తగ్గిస్తూ ప్రభుత్వ భద్రతా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ ముఖ్యనేతలందరూ దీనికి అభ్యంతరం తెలుపుతున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తికి ఏ విధంగా పైలెట్ క్లియరెన్స్ వాహనంతోపాటు ఎస్కార్ట్ వెహికిల్ ను తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు ప్రజల్లో తిరగాల్సిన ఉంటుంది.. అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ నేతలు. అలాగే ప్రజా సమస్యలపై అనేక చోట్లకు తిరగాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. ముందు ముందు చంద్రబాబు రాష్ట్రమంతా తిరగాలనుకుంటున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కనుక పైలెట్ క్లియరెన్స్ వాహనం, ఎస్కార్ట్ వెహికిల్ అవసరం అని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు వారు.

టీడీపీ నేతల అభ్యంతరాలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన సెక్యూరిటీని ఇస్తున్నాం అని.. దీనికితోడు జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఎలాంటి అవరోధం కల్పించటం లేదని స్పష్టం చేస్తోంది. నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని వెల్లడించారు వైసీపీ నేతలు.

Chandrababu
Convoy
Changes
Amaravathi

మరిన్ని వార్తలు