మిగిలింది 24 గంటలే! : విక్రమ్ ల్యాండర్..అడుగంటుతున్న ఆశలు

Submitted on 20 September 2019
Chandrayaan 2 Vikram Lander 24 Hours

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ - 2 వాహన నౌకలోని విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు అడుగంటుతున్నాయి. ఇస్రోతో పాటు నాసా చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్దరణకు ఇస్రో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం తర్వాత చీకటి భాగంలోకి ల్యాండర్ వెళ్లిపోనుంది. దీనిని గుర్తించకపోతే..పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ 17న నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ విక్రమ్ పడిన ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. 

చంద్రయాన్ - 2లో భాగంగా సెప్టెంబర్ 07న చంద్రుడిని ల్యాండర్ విక్రమ్ సమీపించింది. ఈ క్రమంలో భూ కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. దీనితో కనెక్టివిటీ జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే..సెప్టెంబర్ 20 లోపు డెడ్ లైన్. అప్పటి వరకు విజయవంతం కాకపోతే..ల్యాండర్ నిరుపయోగంగా మారిపోతుందంటున్నారు. శుక్రవారంతో చంద్రుడిపై పగటి సమయం ముగస్తుందని, ఉష్ణోగ్రత మైనస్ 240 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందని వెల్లడిస్తున్నారు. శీతల వాతావరణాన్ని తట్టుకొనేలా..విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను తాము రూపొందించలేదన్నారు. చలికి ఇవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. 

ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణం వైపు వెళ్లిన చంద్రయాన్ 2 కాలు పెట్టింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ణలు విజయవంతంగానే దిగాయి. అయితే సిగ్నల్స్ వ్యవస్థ దెబ్బతిన్నది. ఇస్రోతో కమ్యూనికేషన్ కట్ అయ్యింది. దీంతో ల్యాండర్ నుంచి రోవర్ బయటకు రాలేకపోయింది. ఈ రెండింటి కాల పరిమితి 14 రోజులు. ఈ రెండు వారాలు సిగ్నల్స్ కోసం శతవిధాలా ప్రయత్నించింది ఇస్రో. నాసా సాయం కూడా తీసుకుంది. అయినా ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించలేకపోయారు. ఈలోపు గడువు కూడా ముగిసింది. దీంతో ల్యాండర్ కు దాదాపు గుడ్ బై చెప్పినట్లుగా ఇటీవలే ట్వీట్ చేసింది ఇస్రో.
Read More : బస్సును అరెస్ట్ చేసిన పోలీసులు

Chandrayaan 2
Vikram lander
ISRO
nasa

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు