చంద్రయాన్-2కు ముహూర్తం ఫిక్స్

Submitted on 12 June 2019
Chandrayaan 2 Mission will be launched on July 15 early morning at 2 hours 51 minutes

భారతదేశపు ప్రతిష్ఠాత్మక రెండవ మూన్ మిషన్ చంద్రయాన్‌ 2 ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రెడీ అయింది.జులై-15,2019న వేకువజామున 2.51 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు బుధవారం(జూన్-12,2019) ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. సెప్టెంబర్-6,2019లేదా సెప్టెంబర్-7,2019న ఇది చంద్రుడిపై లాండ్ అవుతుందని ఆయన తెలిపారు.చంద్రయాన్-2 మిషన్ కి ఖర్చు ఎక్కువగా శాటిలైట్ పోర్షన్ కే అయిందని,విదేశీ సంస్థల నుంచి సహకారం అదేవిధంగా నేవిగేషన్ కోసం మొత్తంరూ. 603కోట్ల ఖర్చు అయినట్లు శివన్ తెలిపారు.చంద్రయాన్-2 మొత్తం  బరువు 3.8 టన్నులని ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహ‌రికోట నుంచి చంద్ర‌యాన్‌-2ను ప్ర‌యోగించ‌నున్నారు.

చంద్ర‌యాన్‌-2కు చెందిన ఫోటోల‌ను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ప్ర‌యోగం జ‌రుగుతుంది. ఆర్బిటార్ ప్రొప‌ల్‌ష‌న్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్ర‌వేశిస్తుంది. ఆ త‌ర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంది. చంద్రుడిపైన ఉన్న ద‌క్షిణ ద్రువంలో ల్యాండర్ దిగుతుంది. ఇక శాస్త్రీయ ప‌రీక్షల కోసం రోవ‌ర్ అక్క‌డ సంచ‌రిస్తుంది. ల్యాండ‌ర్‌, ఆర్బిటార్ మాడ్యుళ్ల‌లో ప‌రిక‌రాల‌ను శాస్త్ర‌వేత్త‌లు బిగించారు. చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం ద్వారా 11 పేలోడ్స్ కూడా తీసుకువెళ్ల‌నున్నారు. ఇందులో ఇండియాకు చెందిన‌వి ఆరు, యూరోప్‌వి మూడు, అమెరికావి రెండు ఉంటాయి.2009లో చంద్ర‌యాన్-1ను ఇస్రో ప్ర‌యోగించిన విషయం తెలిసిందే.

CHANDRAYAN
india
MOON MISSION
DATE
LAND
fix
DR SIVAN
Chairman
photos
release
ISRO
launched

మరిన్ని వార్తలు