చంద్రబాబు ప్రజలనే కాదు దేవుళ్లను కూడా వేధించారు, అవమానించారు

Submitted on 16 September 2019
chandrababu insulted hindu gods

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు ప్రజలనే కాదు దేవుళ్లను కూడా వేధించారు, అవమానించారు అని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దేవుళ్లకు నిలువనీడ లేకుండా పోయిందన్నారు. ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా చంద్రబాబు పాలనలో అన్యాయం జరిగిందన్నారు. పుష్కరాలు, రహదారుల విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చిన ఘనత చంద్రబాబుదే అని మంత్రి విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజ్ దగ్గరున్న శనీశ్వర ఆలయ ప్రాంతాన్ని మంత్రి వెల్లంపల్లి పరిశీలించారు. ప్రజలు, హిందువులను, ఇతర మతస్తులను బాధ పెట్టే విధంగా వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా టీడీపీ పాలన సాగిందని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

పుష్కరాల పేరుతో టీడీపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో అనేక ఆలయాలను కూల్చిందన్నారు. ఆ సమయంలో హిందూ సేవా సంస్థలతో కలిసి ఆలయాల పరిరక్షణ కోసం వైసీపీ పోరాడిన విషయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో కూల్చిన ఆలయాలను అదే చోట లేదా ఇతర ప్రాంతాలలో పునర్ నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక ఆలయాల పునర్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారని మంత్రి వెల్లడించారు. శనీశ్వర ఆలయం దగ్గర తొలగించిన సీతమ్మ వారి పాదాలను త్వరలో అక్కడే నిర్మాణం చేస్తామన్నారు.

Chandrababu
INSULTED
hindu gods
minister vellampalli srinivas
YSR congress party
temple demolish

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు