చంద్రునితోపాటు అంగారక గ్రహంపై పంటలు పండించే చాన్స్‌

Submitted on 17 October 2019
Chance of growing crops on Mars along with moon

చంద్రునితో పాటు అంగారక గ్రహం ఉపరితలంపై పంటలు పండించవచ్చని నెదర్లాండ్‌కు చెందిన వేజ్‌నింగెన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. దీనికి సంబంధించిన నివేదిక ఓపెన్‌ అగ్రికల్చర్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు నాసా అభివృద్ధి చేసిన కృత్రిమ వాతావరణంలో 10 రకాల పంటలను పండించగా ఊహించని ఫలితాలొచ్చాయి. చంద్రుడు, అంగారకుడిపై ఉండే నేలను, వాతావరణాన్ని సృష్టించి అందులో కొత్తిమీర, టొమాటో, ముల్లంగి, క్వినోవా, పాలకూర, బఠాణీ, వరి ధాన్యం వంటి 10 రకాల విత్తనాలు నాటారు. ఇందులో పాలకూర మాత్రమే అనుకున్నంతగా పెరగలేదు. 

అంగారక గ్రహంపై పండించిన విత్తనాలను మళ్లీ నాటితే ఫలితాలు ఎలా ఉంటాయన్న కోణంలోనూ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ విధానంలో దీర్ఘకాలంలో పంట అసాధ్యమని గుర్తించారు. రెండు రకాల విత్తనాలు మాత్రం అంకురోత్పత్తి విధానంలో బాగా మొలకెత్తగలిగాయి. ముల్లంగి విత్తనాలు 50 శాతం మాత్రమే మొలకెత్తాయి.

అయితే, చంద్ర, అంగారకుడి వాతావరణంలో పంటలు పండించేందుకు భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పంటలకు నీటి వినియోగంలోనూ పరిశోధనలు చేయాల్సి ఉందని చెప్పారు. చంద్ర, అంగారకుడిపై స్థిర కాలనీలు ఏర్పాటు చేసుకున్న పక్షంలో ఆహార భద్రతకు ఇబ్బంది ఉండదని తాజా పరిశోధన భరోసా ఇచ్చిందని సైంటిస్టులు పేర్కొన్నారు.
 

crops
growing
chance
Moon
mars
Researchers
Wageningen University
Netherlands

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు