గోవాలో రామ్ బర్త్‌డే సెలబ్రేషన్స్

Submitted on 15 May 2019
Celebrating Ram's Birthday on the Sets of Ismart Shankar

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా.. ఇస్మార్ట్ శంకర్.. డబుల్ దిమాఖ్ హైదరాబాదీ.. భార్య లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మితో కలిసి పూరి నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రామ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ టీజర్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

రామ్ డిఫరెంట్ గెటప్, డైలాగ్ డెలివరీ, పూరి టేకింగ్, మణిశర్మ ఆర్ఆర్ టీజర్‌లో హైలెట్ అయ్యాయి. రిలీజ్ చేసిన తక్కువ టైమ్‌లోనే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది. రామ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది మూవీ యూనిట్.

అక్కడే ఎందుకంటే, ప్రస్తుతం గోవాలో రామ్, నభా నటేష్‌లపై, కొరియోగ్రాఫర్ భాను నేతృత్వంలో ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. లొకేషన్‌లో టీమ్ మెంబర్స్ మధ్య కేక్ కట్ చేసాడు రామ్. మరో మూడు పాటలతో సినిమా పూర్తవుతుంది. జూన్ లేదా జూలైలో ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కానుంది.

వాచ్ టీజర్..
 

Ram
Nidhhi Agerwal
Nabha Natesh
Mani Sharma
Puri Jagannadh

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు