ఉద్యోగ సమాచారం : CCIలో 19 పోస్టులు

Submitted on 22 April 2019
CCI Jobs Recruitment 2019 - Managers and Officers 19 Posts

న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 19 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. 
Also Read : కర్ణాటకలో విద్యార్థిని హత్య..తీవ్రమౌతున్నఆందోళనలు

ఖాళీలు : మేనేజర్ (ప్రొడక్షన్/మెకానికల్) -2, డిప్యూటి మేనేజర్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎంఎం/మార్కెటింగ్) - 5, ఇంజనీర్ -3, ఆఫీసర్ (హెచ్ఆర్) - 3, అకౌంట్స్ ఆఫీసర్ - 3, ఆఫీసర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) - 3.
అర్హత : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీ డిప్లొమా, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. 
వయస్సు : పోస్టులను బట్టి 35-44 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ (ఎస్‌సీఎల్) అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 
ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తుకు చివరి తేదీ : మే 10, 2019
పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://cciltd.in
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు

CCI Jobs
recruitment
Managers Posts
Officers
19 Posts

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు