నిజమైన మార్పు : మహిళలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుము!

Submitted on 21 October 2019
This Campaign Urges Women To Invest In Something Other Than Gold This Diwali

ధనత్రయోదశి రోజు ఎవరైనా ఏం కొనాలని అనుకుంటారు. ఎలా ఉండాలని అనుకుంటారు. కొత్తగా బంగారం తెచ్చుకోవాలని భావిస్తారు. ఒంటి నిండా నగలు వేసుకుంటే మంచిది అనుకుంటారు. అయితే మన దేశంలో స్త్రీలకు కావాల్సింది బంగారం కాదు.. ఇనుమట!

స్త్రీ ధనం కింద బంగారాన్ని కాదు ఐరన్‌ను అందించాలని అంటున్నారు కొందరు మహిళలు. ఐరన్ లోపంతో మనదేశంలో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఐరన్ పుష్కలంగా లభించే ఆహారాలు ఇవి అంటూ ఓ వీడియోని విడుదల చేసింది ఓ సంస్థ. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.

ధనత్రయోదశి రోజు ఏం కొనాలో చెబుతూ యువతులు ఉన్న.. వీడియో వైరల్ అయ్యింది. ధన త్రయోదశి రోజు బంగారం బదులు 'ఐరన్' కొనాలనే సందేశాత్మక మెసేజ్ అందులో ఉంది. ఈ ధనత్రయోదశికి బంగారు నగల మీద కాక ఒంట్లోని ఐరన్‌ మీద దృష్టిపెట్టండి అంటూ ‘ప్రాజెక్ట్‌ స్త్రీధన్‌’ పేరుతో పౌష్టికాహారం, సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి పనిచేసే డీఎస్‌ఎమ్‌ అనే సంస్థ ఈ సందేశాత్మక ప్రచార చిత్రాన్ని నిర్మించి విడుదల చేసింది.

సాధారణంగా ధనత్రయోదశికి బంగారు ఆభరణాల దుకాణాలు విడుదల చేసే కమర్షియల్ యాడ్‌లకు భిన్నంగా ఆ సంస్థ యాడ్‌ను రూపొందించింది. ఈ వీడియోని మూడు రోజుల క్రితం యూట్యూబ్ లో పోస్టు చేయగా మిలియన్ల మంది చూశారు.

సాధారణంగా మన దేశంలో బంగారానికి విలువ ఎక్కువ ఇస్తారు. ఇనుముకి అసలు ఎలాంటి విలువ ఇవ్వరు. కానీ ఒంట్లో ఐరన్ లేక ఇబ్బంది పడుతున్న మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా 53శాతం ఉంది. అందుకే ప్రాజెక్ట్ స్త్రీధన్ పేరుతో సంస్థ వీడియో విడుదల చేసింది. అక్షయ తృతియ, ధన త్రయోదశి లాంటి రోజుల్లో కచ్చితంగా బంగారం కొనాలకునేవారు వాటికంటే ముందుగా ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు కొనాలని అంటుంది.

Iron Campaign
Women Gold
Diwali
DhanaThrayodhasi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు