‘దున్నపొతు’ కోసం..భార్య కాళ్లు నరికేశాడు

Submitted on 14 March 2019
Buffalo Issue is a dispute..Man Chops Off Wife's Legs Over Sale Of Buffalo

ఓ దున్నపోతు.. కాపురంలో చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య వివాదాన్ని రేపింది. ఇద్దరి మధ్యా తలెత్తిన గొడవ కాసా భార్య కాళ్లనే నరికే స్థాయి వరకూ వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని లింగాలపాడు గ్రామంలో మంగళవారం (మార్చి 13)న జరిగింది. జి.పిచ్చయ..అతని భార్య పేరు రాజేశ్వరి. ఇద్దరి మధ్యా కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మార్చి  మంగళవారం రాత్రి వారి  దున్నపోతును విక్రయించే విషయంలో మరోసారి తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు. ఈ క్రమంలో విచక్షణ మరచిపోయిన భర్త పిచ్చయ్య రాజేశ్వరి రెండు కాళ్లను గొడ్డలితతో  నరికేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
Read Also : ప్రియురాలిని పెళ్లి పీటల మీదే చంపేసిన ప్రియుడు

ఈ దారుణంపై పిచ్చయ్య కుమార్తె మాట్లాడుతూ..తమ తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడూ ఏదోక విషయంలో గొడవ పడుతుంటారనీ తెలిపింది.  దున్నపోతు అమ్మకం విషయంలో  కూడా అమ్మా..నాన్నా పెద్ద  గొడవ జరిగిందనీ..ఆ తర్వాత నాన్న గొడ్డలిని నీటిలో నానబెట్టమని చెప్పాడనీ..ఎందుకో తెలియకపోయినా నీటిలో నానబెట్టి పడుకున్నాననీ.. కానీ అర్థరాత్రి అమ్మ గట్టిగా కేకలు పెట్టడం విని హఠాత్తుగా మెలకువ  వచ్చి... పరుగెత్తుకుని వెళ్లి  చూసేసరికి అమ్మ కాళ్లు రెండు నరికేసి ఉన్నాయని తెలిపింది. స్థానికుల సహాయంతో రాజేశ్వరిని నందిగామలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో కేసు నమోదు  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Pichayya
Rajeshwari
Buffalo Issue
DISPUTE
ax
and pradesh
lingalapadu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు