స్కానింగ్ చూసి డాక్టర్లు షాక్ : కడుపులో పిల్లలు కొట్టుకుంటున్నారు

Submitted on 16 April 2019
Brawling baby twins appear to PUNCH each other in mum's womb

చిన్న పిల్లలు అల్లరి చేయడం కామన్. ఒకే తల్లి కవల పిల్లలు ఏదొక విషయంలో ఇంట్లో పొట్లాడుకోవడం వెరీ కామన్. నాకు అది కావాలంటూ.. నాకు ఇది కావాలంటూ మారం చేస్తుంటారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. అలుగుతుంటారు. తల్లి ఇద్దరి పిల్లలని మందలించడం... లేదంటే బుజ్జగించడం వెరీ వెరీ కామన్. పుట్టకముందే పిల్లలు పొట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? తల్లి కడుపులోనే ఇద్దరు కవలలు కొట్టేసుకున్నారు. కవలలు ఒకరిమీద ఒకరు పంచ్ విసురుకున్నారు.  మీరు చదివింది నిజమే.. కడుపులో కవలలు పొట్లాడుకోవడం ఏంటీ? అనుకుంటున్నారా? మీరే కాదు.. ఆల్ట్రా స్కానింగ్ తీసిన డాక్టర్లు కూడా అదే అనుకున్నారు. పంచ్ లు విసురుకుంటున్న కవలలను చూసి షాక్ అయ్యారు. 
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి

ప్రతి 30 మిలియన్ల  కేసుల్లో అరుదైన కేసు :
అభిమన్యుడు తల్లి కడుపులోనే అన్ని విషయాలు నేర్చుకున్నట్టు.. ఈ ఇద్దరు కవలలు కూడా తమ తల్లి కడుపులోనే ఉండగానే.. కరాటీ, కుంపూ, మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకున్నారేమో అనిపించేలా ఉన్నారు. తల్లి కడుపులో హాయిగా నిద్రపోతున్న కవలలు.. ఎదురెదురుగా చేతులు ముడుచుకుని ఉండటాన్ని వైద్యులు చూసి ఆశ్చర్యపోయారు. ప్రతి 30 మిలియన్ల కేసుల్లో ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు. గత డిసెంబర్ లో ఆల్ట్రా స్కానింగ్ చేసిన నర్సు ఈ దృశ్యాన్ని చూసి పెద్దగా నవ్వేసింది. ఈ కవలల్లో ఇద్దరు ఆడపిల్లలే కావడం విశేషం.

వీరి ముద్దుపేర్లు.. చెర్రీ, స్ట్రాబెర్రీ : 
ఈ స్కానింగ్ చేసిన నాలుగు నెలల తర్వాత చైనాలోని యుంచువాన్ ఆస్పత్రిలో ఈ కవలలు ఆరోగ్యంగా జన్మించారు. ఒక ఆడశిశువు 4.3ఎల్ బీ ఉంటే.. మరో ఆడశిశువు 3.57ఎల్ బీ బరువు ఉంది. ఇద్దరూ ఒక నిమిషం వ్యవధిలో జన్మించారు. స్థానిక నివేదిక ప్రకారం.. పుట్టిన ఆడ కవలలు నెలలు నిండకముందే జన్మించగా.. దీనిపై స్పష్టత లేదు. పుట్టిన ఇద్దరి బేబీలను పేరంట్స్.. చెర్రీ, స్ట్రాబెర్రీ నిక్ నేమ్ లతో ముద్గుగా పిలుకుంటున్నారు.   

Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

Brawling baby
Punch
mum's womb
Yinchuan
China
Cherry
Strawberry   

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు