ఆరు భాషల్లో రిలీజ్ కానున్న భౌ భౌ

Submitted on 15 May 2019
Bow Bow Post Production Works in 6 Languages are Completed

యధార్థ సంఘటనల ఆధారంగా తమిళ్‌లో రూపొంది,ఇంటర్నేషనల్ అవార్డ్ సాధించిన సినిమా.. భౌ భౌ.. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ రిలీజ్ చేసాడు. ఆహాన్ అనే బాలుడు మరియు అతని పెంపుడు కుక్క మధ్య జరిగే కథ ఇది.

లండన్ టాకీస్ బ్యానర్‌పై, కె.నటరాజన్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాని తమిళ్, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల చెయ్యనున్నారు.

ఆరు భాషలకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని మూవీ యూనిట్ తెలిపింది. జూన్ నెలలో భౌ భౌ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి కెమెరా : కె.అరుణ్ ప్రశాంత్, ఎడిటింగ్ : ఈ.గోపాల్, ఎస్.ఆనంద్, మ్యూజిక్ : మార్క్ డి మ్యూజ్, డెనిస్ వల్లబన్,  స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ : ఎస్.ప్రదీప్ కిలికర్.

వాచ్ మోషన్ పోస్టర్..

Bow Bow
Aahaan
London Talkies
S.Pradeep Kilikar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు