అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బొత్స సత్యనారాయణ 

Submitted on 11 July 2019
Botsa Satyanarayana to present agriculture budget in Assembly

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ రేపు(12 జులై 2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందగా కన్నబాబు అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతున్నారు. దీంతో కన్నబాబు స్థానంలో బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నారు.

అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి పూర్తిస్తాయి బడ్జెట్‌ను రేపు ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. సంక్షేమానికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతుండగా.. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదిశగా బడ్జెట్లో కేటాయింపులు చేయబోతున్నారు.

ముఖ్యంగా నవరత్నాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు.  కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించని క్రమంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Botsa Satyanarayana
Agriculture budget
Assembly


మరిన్ని వార్తలు