కోలీవుడా మజాకా : షూటింగ్ కోసం బోయింగ్ విమానం తీసుకున్నారు

Submitted on 23 April 2019
Boeing 757-200 Flight Hired Film Crucial Sequence Vishal's yet Untitled Film-10TV

కోలీవుడ్‌లో విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ మెయిన్ లీడ్స్‌గా.. సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాని ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఆర్ రవీంద్రన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. టర్కీలో క్లైమాక్స్‌కి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురించి కోలీవుడ్‌తో సహా మిగతా సినిమా వర్గాలలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. టర్కీలో షూట్ చేస్తున్న క్లైమాక్స్ ఫైట్ కోసం దర్శకుడు బోయింగ్ 757-200 ఫ్లైట్‌‌ని అద్దెకు తీసుకున్నాడట. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. సినిమాలో కీలకంగా వచ్చే ఈ సీక్వెన్స్ కోసం ఖర్చుకి వెనకాడకుండా నిర్మాత ఫ్లైట్‌ని అరైంజ్ చేసాడట.

విమానాశ్రయంలో మిలిటరీ, పోలీస్ యూనిఫామ్‌లో కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ఎటివి బైక్ నడుపుతూ విశాల్ గాయాల పాలయ్యాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో ఒక్కడొచ్చాడు తర్వాత విశాల్, తమన్నా జతకడుతున్నారు. మరోవైపు విశాల్ నటిస్తున్న టెంపర్ రీమేక్ అయోగ్య త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.
 

Vishal
Tamannaah
R Ravindran
Sundar C

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు