ఆపరేషన్ రాయల్ వశిష్ట - 2 : బయటకు వచ్చిన బోటు రెయిలింగ్

Submitted on 17 October 2019
Boat Railing came out Operation Vasistha 2

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆపరేషన్ రాయల్ వశిష్ట -2 కంటిన్యూ అవుతోంది. బోటు వెలికితీతలో ధర్మాడి టీం పురోగతి సాధించింది. అక్టోబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం రెయిలింగ్ బయటకు రావడంతో..ఇక బోటు బయటకు వస్తుందనే ఆశలు చిగురించాయి. కొన్ని రోజులుగా బోటు వెలికితీత పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు పడుతుండడం..ఇతరత్రా కారణాలతో వెలికితీత పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. రెయిలింగ్ మాత్రమే వచ్చిందని, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం ఆపరేషన్ కొనసాగిస్తామని ధర్మాడి వెల్లడించారు. 

నాలుగు రోజుల పాటు జల్లెడ పట్టింది. కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా పనులు ఆగిపోయాయి. తర్వాత ఆపరేషన్ 2 చేపట్టింది. ధర్మాడి టీం కృషి ఫలిస్తోంది. బోటు ఉన్న ప్లేస్‌ను గుర్తించిన ధర్మాడి బృందం... దాని చుట్టూ రోప్‌లు వేసి ఉంచింది. గజ ఈతగాళ్లతో సంప్రదింపులు జరుపుతూ సంప్రదాయ పద్దతిలో పనులు కొనసాగిస్తోంది ధర్మాడి బృందం. బోటును లంగరు ద్వారా కదలించి  ఉచ్చులో బిగించేలా చేశారు. వీరికి సహాయంగా కాకినాడ నుంచి మరోక టెక్నికల్ టీమ్ కూడా కచ్చులూరు వద్దకు చేరుకుంది. 

సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Read More : చిగురిస్తున్న ఆశలు : సాయంత్రానికి బోటు బయటకు వచ్చే అవకాశం

Boat Railing
came
Operation Vasistha 2
East Godavari
kachuluru

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు