బీజేపీ కొత్త నినాదం : సబ్ సే బడా ధన్..బేటీ, జల్ ఔర్ వన్

Submitted on 16 September 2019
BJP New Slogan Sabse Bada Dhan- Beti, Jal & Van

బీజేపీ కొత్త నినాదంతో ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు.. కొత్త కొత్త నినాదాలను ప్రచారంలోకి తీసుకొస్తోంది. అబ్ కీ బార్, మోడీ సర్కార్ అనే నినాదం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత్ వెలిగిపోతోంది, నేను కాపలాదారుడినే, భేటీ బచావో, భేటీ పడావో, అబ్ కీ బార్..చార్ సౌకే పార్..ఇలా ఎన్నో నినాదాలు తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి మోడీ జన్మదినం సందర్బంగా నినాదాలను దేశ మంతటా అమలు చేయనుంది.

తాజాగా బేటీ బచావో, బేటీ పఢావోకు ప్రోత్సాహమే లక్ష్యంగా..నినాదం ఉండనుంది. సబ్ సే బడా ధన్..బేటీ, జల్ ఔర్ వన్ (అన్నింటికంటే పెద్ద ఆస్తులు - కూతురు, నీరు, అడవి) అమలు చేయనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. 

బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం బీజేపీ జాతీయ కన్వీనర్ రాజేంద్ర ఫడ్కే పాట్నాలో వెల్లడించారు. మోడీ జన్మదినం సందర్భంగా అమలు చేయనున్నామన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ ప్రధాన మంత్రి మోడీ జన్మదినం. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు..సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు సేవా సప్తాహంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆడపిల్ల జన్మించిన ప్రాంతంలో, ప్రధానంగా నిరుపేదలుండే...చోట బీజేపీ నేతలు స్వీట్లు పంచి ఓ మొక్కను నాటుతారు. నీటి సంరక్షణ ప్రాధన్యం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తారు. దేశంలోని అన్ని జిల్లాలు, అన్ని బ్లాకుల్లో జరుగుతుందని రాజేంద్ర ఫడ్కే తెలిపారు. 

BJP
New Slogan
Sabse Bada Dhan- Beti
Jal & Van

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు