కోడెల ధైర్యవంతుడు : మృతిపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ డిమాండ్

Submitted on 19 September 2019
bjp demand for enquiry on kodela death

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విచారం వ్యక్తం చేశారు. కోడెల చాలా ధైర్యవంతుడు అని చెప్పారాయన. అలాంటి నేత ఆత్మహత్యకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించిదన్నారు. కోడెల మృతిపై సమగ్ర విచారణ జరపాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. కోడెల మృతిపై రాజకీయాలు చేయటం సరికాదని హితవు పలికారు. అనంతపురంలో జీవీఎల్ పర్యటించారు. బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కోడెల మృతి, రాజధాని అంశాలపై స్పందించారు.

రాష్ట్ర రాజధాని అమరావతిపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని, హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదన్నారు. రాష్ట్రం నిర్ణయం ఫైనల్ అంటూనే.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా వికేంద్రీకరణ జరగాలన్నారు. 

గతంలో రాయలసీమలోని ఒక్కో జిల్లాకు కేంద్రం రూ.50కోట్లు ఇచ్చిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. కేంద్ర నిధులకు లెక్కచెప్పమంటే చంద్రబాబు స్పందించలేదని విమర్శించారు. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని మండిపడ్డారు. అమరావతిలో చంద్రబాబు గ్రాఫిక్స్‌ సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. 

kodela sivaprasad rao
GVL
BJP
Demand
enquiry
ap capital
High Court
cm jagan

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు