కొంప, కుటుంబం వద్దా రా : 12 గంటల డ్యూటీ చేసిన చైనా కంపెనీలు

Submitted on 13 April 2019
Billionaire Jack Ma wants 996 work culture at Alibaba Company

వారంలో 6 రోజులు ఆఫీసు.. ఒక రోజు వీకాఫ్.. 8 గంటల డ్యూటీ.. చాలా కంపెనీల్లో ఇది కామన్. కానీ, ఓ కంపెనీలో మాత్రం రోజుకు 12 గంటలు డ్యూటీ చేయాలి.   ఓవర్ టైమ్ పనిచేయాలి. అయినప్పటికీ నెలకు అంతే జీతం ఇస్తారు. వారానికి 6 రోజులు ఆఫీసు.. ఒక రోజు వీకాఫ్ ఇదంతా సేమ్. ప్రస్తుతం చైనా కంపెనీల్లో ఇదే వర్క్ కల్చర్ నడుస్తోంది. చైనా టెక్నాలజీ కంపెనీలు ఈ ట్రెండే ఫాలో అవుతున్నాయి.

చైనా అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్ ఫాం ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ కూడా ఓవర్ టైమ్ వర్కింగ్ కల్చర్ తీసుకోచ్చింది. తమ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటే.. ఓవర్ టైమ్ డ్యూటీ చేయాల్సిందే.. లేదంటే.. ఉద్యోగం మానేయడంటూ స్టాప్ వర్కర్లకు అల్టిమేటం జారీచేసింది. కంపెనీలో జాయిన్ అయ్యే ముందే ఆలోచించుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం అంటోంది ఆలీబాబా కంపెనీ. ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు, బిలినీయర్ జాక్ మా.. తమ ఇండస్ట్రీలో ఓవర్ టైమ్ 996 వర్క్ కల్చర్ ను తీసుకురానున్నట్టు ఆలీబాబా అధికారిక వైబో అకౌంట్‌లో పోస్టు పెట్టారు.
Read Also : వాడెవడండీ బాబూ : ఆ సీమ పోలింగ్ బూతుల్లో మంత్రించిన ఆవాలు

ఇటీవల జరిగిన కంపెనీ అంతర్గత సమావేశంలో జాక్ మా మాట్లాడుతూ.. ఆలీబాబా కంపెనీకి 8 గంటల డ్యూటీ ఆఫీసు లైఫ్ స్టయిల్ కోరుకునే వారు అవసరం లేదన్నారు. జాక్.. ఉద్దేశం ప్రకారం.. 9 : 9 : 6 అంటే.. వారంలో ఆరు రోజులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘996 వర్క్ కల్చర్ ప్రకారం.. మా కంపెనీలో పనిచేయగలరా? ఆలీబాబాలో జాయిన్ కావాలనుకుంటే.. రోజుకు 12 గంటల డ్యూటీకీ సిద్ధంగా ఉండాలి. లేదంటే.. జాయిన్ కానందుకు బాధపడొద్దు’ అని అన్నారు.

జాక్ మా 996 వర్క్ కల్చర్ తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా టెక్ కంపెనీల్లో చాలామంది ప్రొగ్రామర్లు.. గంటల కొద్ది ఓవర్ టైమ్ డ్యూటీ చేసి తీవ్ర ఒత్తిడి కారణంగా చనిపోతున్నారు. జాక్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 996 వర్క్ షెడ్యూల్ లో ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తే.. అదనంగా వేతనం ఇస్తారా లేదో స్పష్టం చేయకపోవడం అర్థరహితమంటు కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఆలీబాబా నుంచి ఎలాంటి స్పందన లేదు. 
Read Also : Be Alert : మీ 2G.. PoS మిషన్స్ Upgrade చేయండి

Jack Ma
996 work culture
Alibaba Company
E-Commerce Platform

మరిన్ని వార్తలు