బిగ్ బాస్3 : పునర్నవిపై ఫైర్.. బూట్లు తుడిచిన నాగార్జున

Submitted on 14 September 2019
Bigg Boss Telugu Season 3 Host Nagarjuna Full serious

మా టీవీలో ప్రసారమౌతున్న బిగ్ బాస్ 3 విజయవంతంగా రన్ అవుతోంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో..8 వారాలు కంప్లీట్ చేసుకుంది. వీకెండ్ శని, ఆదివారాలు వచ్చాయంటే ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఒక కంటెస్ట్ ఎలిమినేట్ చేస్తాడు బిగ్ బాస్. దీంతో ఎవరు అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది మా టీవీ.

ఈ షోలో నాగార్జున యమ సీరియస్‌గా ఉన్నారు. ఎంట్రీ ఇస్తూనే..నో సాంగ్స్..నో డ్యాన్స్..ఇక్కడిదాక ఉంది..అంటూ గొంతును పట్టుకుని అన్నారు నాగ్. ముందు హౌస్ మేట్స్‌తో మాట్లాడాలంటూ కొంత కఠువుగానే అన్నారు. దీంతో ఎవరికీ క్లాస్ పీకుతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరొక్క వీడియోలో సభ్యులను నిలదీశారు. ప్రధానంగా శ్రీ ముఖి, పునర్నవిలను క్లాస్ పీకారు.

రాహుల్ దగ్గరికి వెళ్లి..డోన్ట్ గివ్ అప్..అన్నావు కదా..వై డిడ్ యు..గివ్ అప్..బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌పై ఏమన్నావు అంటూ పునర్నవిని కోపంగా ప్రశ్నించారు. శ్రీ ముఖిపై కూడా ఆగ్రహం ప్రదర్శించారు. నీ ఆట ఎలా ఉందంటే..కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని సీరియస్ అయ్యారు. దీనికి శ్రీ ముఖి సమాధానం ఇచ్చారు. వెంటనే నువ్వు ఈ హౌస్‌కు బాస్‌వి కాదు..ఈ హౌస్‌కు బిగ్ బాస్ అంటూ ఘాటుగా నాగార్జున వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ ఏపిసోడ్ మాత్రం సీరియస్‌గా సాగేలాగ ఉందని తెలుస్తోంది. 

 

 

Bigg Boss Telugu Season 3
Contestant
eliminated
Srimukhi
Punarnavi
Host Nagarjuna

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు