'Bigg Boss Telegu' season 4 with Nagarjuna as host all set to roll from August?

బిగ్ బాస్ రద్దు పుకార్లే.. ఆగస్ట్ నుంచే సీజన్ 4

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగులో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యగా.. తెలుగులో ఆదరణ దక్కించుకున్న ఈ షోని తర్వాత వరుసగా నానీ, నాగార్జున హోస్ చేశారు.

గత సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయ్యగా.. నాల్గవ సీజన్‌ని కూడా నాగార్జునే హోస్ట్ చెయ్యనున్నారు. గత మూడు సీజన్‌లను చూసినట్లయితే బిగ్ బాస్ షోకి మార్చి ఏప్రిల్‌ నుండే ఏర్పాట్లు చేసేవాళ్లు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండగా.. లేటెస్ట్‌గా షో రద్దు అయ్యిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సీజన్ ఆగస్ట్‌లో ప్రారంభం అవ్వనుంది. 

అంతేకాదు ఈ సీజన్‌లో పాల్గొనే వారు కొందరు ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

Read: ఒంటరిగా ఎన్టీఆర్‌ ఘాట్‌‌లో హీరోయిన్.. తెలుగు ప్రజల దేవుడు అంటూ ప్రశంసలు

Related Posts