bigg-boss-2-winner-ashutosh-kaushik-gets-married

పురోహితుడు, నలుగురు అతిథులు.. టెర్రస్‌పై బిగ్ బాస్-2 విన్నర్ వివాహం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ కారణంగా శుభకార్యాల ఊసే లేదు. ముందుగా పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్నవాళ్లు చాలామంది వాయిదా వేసుకున్నారు. తప్పదు అనుకున్న వాళ్లు నియమాలు పాటిస్తూ సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. తాజాగా ‘Bigg Boss 2’, ‘Roadies Season 5’ విన్నర్ అశుతోష్‌ కౌశిక్‌ ఓ ఇంటివాడయ్యాడు. అలీఘర్‌కు చెందిన అర్పితను ఏప్రిల్ 26న పెళ్లి చేసుకున్నాడు. నోయిడాలోని అశుతోష్‌ ఇంటి టెర్రస్‌పై జరిగిన ఈ పెళ్లికి పురోహితుడితో పాటు కేవలం నలుగురు అతిథులు మాత్రమే హాజరయ్యారు.

వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అశుతోష్‌ తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. పెళ్లి తంతు జరుగుతుండగా బ్యాటుతో దోమలను కొడుతూ కనిపించాడు కౌశిక్. తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా ఆదా అయిన డబ్బులను పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు అశుతోష్‌ తెలిపాడు. అలాగే తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వస్తున్న మొత్తాన్ని కూడా ఛారిటీకి ఇవ్వనున్నట్టు చెప్పాడు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా తాను కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకుంటానని, పెళ్లి అనేది వ్యక్తిగత అంశమని.. దానికి పెద్ద సంఖ్యలో జనాలు, మ్యూజిక్‌, డ్యాన్స్‌లు ఎందుకని ప్రశ్నించిన అశుతోష్ తనకు నచ్చిన విధంగానే పెళ్లి చేసుకున్నాడు. 

Related Posts