ప్రాణాలు కాపాడుతున్నారు: 18 మంది హైదరాబాదీలను దత్తత తీసుకున్న అమెరికన్లు

Submitted on 9 June 2019
Big heart foreign couples adopt 18 Hyderabad kids with special needs

జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలీదు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్‌లో శ్రీ అనే నెలరోజుల వయస్సున్న HIV పాజిటివ్ చిన్నారిని అమెరికన్ దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ట్రీట్ మెంట్ చేయించడంతో పూర్తిగా ఆ మహమ్మారి నుంచి బయటపడగలిగింది శ్రీ. నిరాశ్రయులైన వారిని అందులో ప్రత్యేక చికిత్స కొరత ఉన్నవారిని ఏరికోరి దత్తత తీసుకునేందుకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారట. హైదరాబాదీ  పిల్లలను దత్తత తీసుకునేందుకు విదేశీయులు ముందుకు వస్తున్నారంటూ హైదరాబాద్‌లోని చిన్నారుల దత్తతను పర్యవేక్షించే అధికారులు  వెల్లడించారు. 

2019 జనవరి నాటికి HIVతో బాధపడుతున్న వారితో కలిపి మొత్తం 18మందిని దత్తత తీసుకుంటున్నట్లు సమాచారం. 11ఏళ్ల హార్ష్‌ను తన కుటుంబం 6ఏళ్ల వయస్సున్నప్పుడే HIVపాజిటివ్ అని తెలియడంతో క్రైస్తవ అనాథశ్రమంలో వదిలేశారు. అప్పట్నుంచి అతని కోసం ఎవరూ అక్కడికి రాలేదు. సమాచారం తెలుసుకున్న అమెరికన్ దంపతులు 2019 మే నెలలో అతనిని దత్తత తీసుకుని చికిత్స చేయించేందుకు అమెరికా తీసుకెళ్లారు. ఇంతేగాక, అవయవ లోపం, అంధులు, చెవిటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులపై కూడా దయ చూపిస్తున్నారట విదేశీయులు. 

అమెరికన్లతో పాటు, ఇటలీ, ఫిన్లాండ్ నుంచి వస్తున్న వారు సంక్షేమ పథకాలను, వారితో పాటు పంపిస్తే పిల్లలు సురక్షితంగా ఉంటారని చెప్పడంతో పిల్లల క్షేమం కోసం కన్నవారే వారిని విదేశాలకు పంపుతున్న సందర్భాలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను ముందుకొచ్చి విదేశీయులు దత్తత తీసుకుంటున్నప్పటికీ  ఇంకా హైదరాబాద్‌లోని 64మంది చిన్నారులు ఎవరో ఒకరు వచ్చి దత్తత తీసుకుంటారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Hyderabad
ORPHANS
AMERICANS

మరిన్ని వార్తలు