మీ మాటలు వింటుంటే నాకు మూడ్ వస్తోంది..కోర్టులో జడ్జి వ్యాఖ్యలు

Submitted on 18 September 2019
Bermuda judge slammed for saying he got ‘horny’ during murder trial

గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నప్పుడు నోరు అదుపులో ఉండాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా వుండాలి. మాటలు, చర్యల్లో చాలా బ్యాలెన్సింగ్ చూపించాలి. పొరపాటున నోరు జారినా అది సమాజంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే నోటిని  అదుపులో వుంచుకోవడం ఉత్తమం అంటారు. కానీ, ఓ జడ్జి నోరు జారాడు. అది కూడా కోర్టులో అంతమంది మధ్యలో. ఆయన వ్యాఖ్యలు విని అందరూ షాక్ అయ్యారు.

బెర్ముడా..బ్రిటీష్ ఆధీనంలో ఉన్న ప్రాంతం. అక్కడి స్థానిక కోర్టులో గత సెప్టెంబర్‌ లో ఓ హత్య కేసు విచారణకు వచ్చింది. స్మీత్ విలియమ్స్..ఈ కేసులో నిందితుడు. కాల్‌ఫోర్డ్‌ అనే వ్యక్తిని హత్య చేశాడనేది అతడిపై ఉన్న ఆరోపణ. జూనియర్ జడ్జి కార్లిస్లే గ్రీవ్స్ ఓ హత్య కేసును విచారిస్తున్నాడు. విచారణ సందర్భంగా ముద్దాయి తరపు లాయర్ సాక్షిగా ఉన్న ట్రాయ్ హర్రీస్ అనే వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టాడు. స్మిత్ విలియమ్స్‌కు దగ్గరైన మహిళలకు తనూ దగ్గరయ్యానని సాక్షి కోర్టుకు తెలిపాడు. వారి మధ్య నడిచిన వ్యక్తిగత వివరాలు కూడా న్యాయమూర్తి గ్రీవ్స్‌ ముందు పూసగుచ్చినట్టు వివరించాడు. అతడిచ్చిన వాంగ్మూలంలో శృంగార సంబంధిత విషయాలు కూడా అనేకం ఉన్నాయి. అతని మాటలు వింటున్న జడ్జి కార్లిస్లే.. ఆ సెక్స్ వ్యాఖ్యలు వింటుంటే నాలో శృంగార కోరికలు రగలుతున్నాయని ఇంత కూడా తడుముకోకుండా అదీ న్యాయదేవత సాక్షిగా నిస్సిగ్గుగా అనేశాడు. ఆయన వ్యాఖ్యలు విని కోర్టులో వున్నవాళ్లందరూ షాక్ అయ్యారు.

ఈ వాదోపవాదల అనంతరం న్యాయమూర్తి...స్మిత్ విలియమ్స్‌ ను దోషిగా తేలుస్తూ తీర్పిచ్చారు. కాగా నిందితుడి తరఫు న్యాయవాది ఈ కేసును ఎగువ కోర్టులో అప్పీల్ చేశాడు. విచారణ సందర్భంగా జడ్జి కార్లిస్లే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు కాబట్టి దాని ప్రభావం తీర్పు మీద కూడా ఉందని అప్పీల్‌ లో తెలిపాడు. ఈ అప్పీల్‌ పై ఇటీవలే ఎగువ కోర్టు తీర్పు వెలువరించింది. కార్లిస్లే వ్యాఖ్యలకు ఆయనిచ్చిన తీర్పుతో ఎటువంటి సంబంధం లేదని తెల్చిచెప్పింది. అయితే ఆయన వ్యాఖ్యలు మాత్రం కోర్టు స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని ఆక్షేపించింది.

Bermuda
Judge
slammed
horny
murder
Trial
Carlisle Greaves

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు