being a minister i am exempted no hotel quarantine for sadananda gowda after flight to bengaluru

నేను మంత్రిని..నేను క్వారంటైన్ వెళ్లటమేంటీ..మాకు అవేవీ వర్తించవు తెలిసిందా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా నిబంధనలు మంత్రులకు ఉండవట. భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు మంత్రులకు వర్తించవట. ఆ మాట స్వయానా మంత్రిగారే చెప్పారు. కరోనా నిబంధనలు సామాన్యులకే..మాలాంటి మంత్రివర్యులకు కాదు..పైగా నేను ఫార్మసీ మినిష్టర్ని అని చెప్పారు కేంద్రమంత్రి  స‌దానంద గౌడ. 

కేంద్ర మంత్రి స‌దానంద గౌడ  సోమవారం (మే 25,2020) ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో వ‌చ్చారు. అయితే ఆయ‌న హోట‌ల్ క్వారెంటైన్‌కు వెళ్ల‌లేదు. ఈ విషయాన్ని మంత్రిని ఓ విలేఖరి ప్రశ్నించగా.. క్వారెంటైన్ నిబంధ‌న‌లు అంద‌రికీ ఒక్క‌టే. కానీ..కొంత మందికి (అంటే ఇటువంటి మంత్రులకు మాత్రమే అనుకుంటా) మిన‌హాయింపులు ఉంటాయని అన్నారు. 

నేను ఓ మంత్రిని..ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. నా ఫోన్‌లో ఆరోగ్య‌సేతు యాప్ ఉందనీ తేల్చి చెప్పారు.  ఫార్మ‌సీ శాఖ‌కు నేను మంత్రిని..ఒక‌వేళ మందుల‌ను సరైనంతగా స‌ర‌ఫ‌రా చేయ‌కుంటే..కరోనా కేసులు పెరుగుతాయనీ..దేశ‌మంతా మందులు స‌ర‌ఫ‌రా జ‌రిగేలా చూడాల‌నేది నా బాధ్య‌త ..ఒక‌వేళ డాక్ట‌ర్లు క్వారెంటైన్ అయితే..మందులు స‌ర‌ఫ‌రా చేసేవాళ్లే క్వారెంటైన్ అయితే..అప్పుడు క‌రోనా వైర‌స్‌ను ఎవ‌రు ఎదుర్కొంటార‌ని ప్రశ్నిస్తూ మంత్రిగారూ  అని అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

కాగా..దేశీయ విమానాల్లో క‌ర్నాట‌క వ‌స్తున్న‌వారికి ఏడు రోజులు హోట‌ల్ క్వారెంటైన్ త‌ప్ప‌నిస‌రి చేశారు. అలా వచ్చినవారు ఎవరైనా సరే ఏడు రోజుల హోమ్  క్వారెంటైన్ కావాలి. మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. కానీ ఈ నియ‌మం నుంచి కొంద‌రికి మిన‌హాయింపులు ఉన్నాయి. అంటే ఇలా వీవీఐపీలకు అన్నమాట. బహుశా మంత్రిగారు అదే ఉద్ధేశ్యంతో చెప్పి ఉంటారు. 

Read: శంషాబాద్ లో ఎగిరిన విమానం : ఆరోగ్య సేతు యాప్ ఉన్న వారికే ఎంట్రీ