హైదరాబాద్ బ్రేకింగ్ : బేగంపేట మెట్రోస్టేషన్ మూసేశారు

Submitted on 21 October 2019
Begumpet Metro Station closed

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  హైదరాబాద్, బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ ను అధికారులు మూసివేశారు. ఈ రోజు రైళ్లు ఇక్కడ ఆగవని ప్రతి స్టేషన్ లోనూ ప్రకటిస్తున్నారు. గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సోమవారం నాడు  కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపు నిచ్చింది. ఇందుకోసమే  అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రగతి భవన్ కు మెట్రో స్టేషన్ దగ్గరలో ఉండటం...ఆందోళన కారులు అక్కడి నుంచి ముట్టడికి ప్రయత్నించే అవకాశం ఉందని ..ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే స్టేషన్ను అధికారులు మూసివేసినట్లు సమాచారం. 

సోమవారం తెల్లవారుఝూమునుంచే  ప్రగతి భవన్ వద్ద పోలీసు బందో బస్తు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.  మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, షబ్బీర్ ఆలీతో సహా పలువురు సీనియర్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 

Telangana
Hyderabad
begumpet
Congress
TS RTC strike

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు