మే 31న సర్వీసు స్టాప్ : బ్లాక్ బెర్రీ మెసేంజర్ షట్ డౌన్

Submitted on 22 April 2019
BBM Aka BlackBerry Messenger to Shut Down in May, but BBME to be Available to Individual Users

బ్లాక్ బెర్రీ మెసేంజర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. బ్లాక్ బెర్రీ మెసేజంర్ (BBM) సర్వీసు షట్ డౌన్ కానుంది. ఇండోనేషియా ఆధారిత కంపెనీ ఎమ్ టెక్ కు చెందిన బ్లాక్ బెర్రీ మెసేంజర్ సర్వీసు మే 31న నిలిచిపోనుంది. బీబీఎం కంజ్యూమర్ వెర్షన్ డెవలప్ మెంట్ సర్వీసును 2016లో ప్రవేశపెట్టింది. ఈ మెసేంజర్ సర్వీసు మే ఆఖరిలో నిలిచిపోనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

బీబీఎం ఎంటర్ ప్రైజేస్ (BBMe) సర్వీసును వ్యక్తిగత యూజర్ల కోసం రిలీజ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ (BBMe) వెర్షన్ డౌన్ లోడ్ చేసుకునేందుకు యూజర్లకు అందుబాటులో ఉంది. ఐఓఎస్ వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది.
Also Read : అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు : Cable, DTH ఆపరేటర్లకు TRAI వార్నింగ్

ప్రపంచంలో ఎంతో పాపులర్ అయిన మెసేజింగ్ యాప్స్ లో బ్లాక్ బెర్రీ మెసేంజర్ ఒకటి. ఇందులోని కీ ఫీచర్ బ్లాక్ బెర్రీ డివైజ్ ల కోసం ప్రత్యేకించి డిజైన్ చేశారు. ఆ తర్వాత ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై కూడా ప్రవేశపెట్టారు. అయితే.. ప్రముఖ సోషల్ మెసేంజర్ యాప్ లు వాట్సాప్, ఫేస్ బుక్ మెసేంజర్ చాట్ యాప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. బ్లాక్ బెర్రీ మెసేంజర్ యాప్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. అందుకే ఎమ్ టెక్ కంపెనీ.. కొత్త యూజర్లకు బీబీఎం మెసేంజర్ సర్వీసు నిలిపివేయడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. బ్లాక్ బెర్రీ మెసేంజర్ యాప్ సర్వీసు మే 31వరకు అందుబాటులో ఉంటుంది. అప్పటివరకూ యూజర్లు ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు. 
Also Read : కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వ‌ర్డ్‌ మాకు తెలుసు

BBME సర్వీసు.. వ్యక్తిగత యూజర్లకు మాత్రమే 
ముఖ్య గమనిక :
BBOs లేదా బ్లాక్ బెర్రీ 10 యూజర్లు ఈ మెసేంజర్ సర్వీసును వినియోగించుకోవచ్చు. బ్లాక్ బెర్రీ తమ సర్వీసును బీబీఎం ప్లాట్ ఫాంపై కొనసాగించనుంది. కానీ, బ్లాక్ బెర్రీ మెసేంజర్ యాప్ సర్వీసును షట్ డౌన్ చేసిన తర్వాత.. బీబీఎం ప్లాట్ ఫాం నుంచి యూజర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మెసేజ్ లు సెండ్ చేయలేరు, పంపడం కుదరదు. బ్లాక్ బెర్రీ మెసేంజర్ సర్వీసును బీబీఎం ఎంటర్ ప్రైజ్ సర్వీసును వ్యక్తిగత యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్ టెక్ కంపెనీ నిర్ణయించినట్టు ఒక పత్రిక ప్రకటనలో తెలిపింది. కంపెనీ ఎంటర్ ప్రైజ్ కస్టమర్లకు మాత్రమే లిమిటెడ్ సర్వీసు అందించనున్నారు.

BBMe సర్వీసు.. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ల నుంచి బీబీఎంఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆపిల్ యాప్ స్టోర్లలో త్వరలో ఈ బీబీఎంఈ యాప్ అందుబాటులోకి రానుంది. బ్లాక్ బెర్రీ అందించే బీబీఎంఈ సర్వీసు తొలి ఏడాదిలో యూజర్లకు ఉచితంగా అందించనున్నారు. ఆ తర్వాత యూజర్లు.. ఈ సర్వీసు పొందాలంటే.. ఆరు నెలల సబ్ స్ర్కిప్షన్ కింద 2.49 డాలర్లు (రూ.170) వరకు చెల్లించాల్సి ఉంటుంది. 
Also Read : అదిరిపోయే ఫీచర్లు : Realme 3 Pro వచ్చేసింది

BBM Enterprise
BBM
Aka BlackBerry
BlackBerry Messenger
Individual Users

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు