బాటా ఏంటీ లూటీ : క్యారీ బ్యాగులపై జరిమానా

Submitted on 15 April 2019
Bata fined Rs 9000 for asking customer to pay Rs 3 for carry bag

రిటైల్ బ్రాండ్ బాటా ఇండియా లిమిటెడ్ కంపెనీకి షాక్ తగిలింది. కస్టమర్ల నుంచి అధికంగా సర్వీసు ఛార్జీలు వసూలు చేస్తున్న బాటా కంపెనీపై జరిమానా పడింది. చండీగఢ్ వినియోదారుల ఫారం బాటా కంపెనీకి రూ.9వేలు జరిమానా విధించింది. బాటా కంపెనీలో ప్రొడక్టులు కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి పేపర్ బ్యాగుకు అదనంగా రూ.3 ఛార్జ్ చేస్తున్నట్టు ఓ కస్టమర్ వినియోగదారుల ఫారంను ఆశ్రయించాడు. సర్వీసుల్లో నాణ్యత లోపంతో కస్టమర్లను అధిక ఛార్జీలతో వేధిస్తున్న బాటా కంపెనీకి వినియోగదారుల ఫారం చీవాట్లు పెట్టింది. చండీగడ్ నివాసి దినేష్ ప్రసాద్ అనే వినియోగదారుడు వినియోగదారుల ఫారంలో ఫిర్యాదు చేయడంతో బాటాపై చర్యలు తీసుకుంది.
Read Also : ఆజంఖాన్ గెలిస్తే.. మహిళకు రక్షణ ఉండదు : జయప్రద

కస్టమర్ దినేశ్.. ఫిబ్రవరి5న సెక్టార్ 22డీలోని బాటా స్టోర్ నుంచి రెండు జతల షూలను కొనుగోలు చేశాడు. ఇందుకు బాటా స్టోర్.. పేపర్ బ్యాగు ఛార్జీలతో కలిపి మొత్తం రూ.402 బిల్లు వేసింది. దీంతో కస్టమర్ దినేశ్.. పేపర్ బ్యాగుపై (రూ.3 ఛార్జ్) చెల్లించేందుకు నిరాకరించాడు. పేపర్ బ్యాగుపై నగదును రీఫండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశాడు. బాటా సర్వీసుల్లో నాణ్యత లోపించిందని తనకు నట్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. వినియోదారుల ఫారంకు బాటా స్టోర్ సర్వీసుపై ఫిర్యాదు చేశాడు. 

బాటా సర్సీసు వినియోగించుకున్నప్పటికీ తనపై పేపర్ బ్యాగు ఛార్జీలు వేశారని ఫిర్యాదులో తెలిపాడు. ఆ పేపర్ బ్యాగుపై బాటా బ్రాండ్ ఆమోద ముద్ర లేదని ఆరోపించాడు. దినేశ్ ఆరోపణలపై స్పందించిన బాటా కంపెనీ తీవ్రంగా ఖండించింది. మరోవైపు.. పేపర్ బ్యాగుకు కస్టమర్లను చెల్లించాలని బలవంతం చేయడం సర్వీసులో నాణ్యత కొరవడినట్టు స్పష్టంగా కనిపిస్తోందని ఫారం తెలిపింది.
Read Also : హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు : ట్యాంకర్లకు డిమాండ్

స్టోర్ నుంచి కస్టమర్ ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు.. సదరు వ్యక్తికి ఉచితంగా పేపర్ బ్యాగు అందించాల్సింది ఉంటుందని పేర్కొంది. సర్వీసు డ్యూటీ కింద కస్టమర్లకు తప్పనిసరిగా ఉచితంగా పేపర్ బ్యాగులను అందించాలని ఫారం సూచించింది.

అంతేకాదు.. కస్టమర్ దినేశ్ కు పేపర్ బ్యాగుపై రూ.3, లిటిగేషన్ ఛార్జీ రూ.వెయ్యి రీఫండ్ చేయాల్సిందిగా బాటాను ఆదేశించింది. అదనంగా రూ.3వేలు కస్టమర్ కు నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. షూ బ్రాండ్ పై రూ.5వేలు లీగల్ ఎయిడ్ అకౌంట్ (స్టేట్ కంజ్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్)లో డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది.  
Read Also : YCP నేతలతో మాకు ప్రాణహాని: నెల్లూరులో తీవ్ర ఉద్రిక్తత

carry bag
customer
Chandigarh consumer forum  

మరిన్ని వార్తలు