బ్యాంకుల్లో పర్సనల్ లోన్, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు ఇవే!

Submitted on 18 February 2020
Bank savings account interest rate at 7%. Check latest rates here

బ్యాంకుల్లో ఇచ్చే పర్సనల్ లోన్లు అంటే.. రేపటి ఆదాయాన్ని ఈ రోజే వాడుకోవడం అని అర్థం. ఇతర లోన్లు మాదిరిగా కాదు. ఇళ్లు కొనడం లేదా చదువుల కోసం తీసుకునే రుణాలు వంటిది కాదు. పర్సనల్ లోన్లు తీసుకుంటే భారీ మొత్తంలో వడ్డీరేట్లను భరించాల్సి వస్తుందని గుర్తించుకోవాలి.

ఒక కారు లోన్ కంటే అత్యధికంగా వడ్డీ రేట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పర్సనల్ లోన్లు అన్ సెక్యూర్డ్ లోన్లు. ఏదైనా ఆస్తి తాలుకూ వివరాల ఆధారంగా పర్సనల్ లోన్లను బ్యాంకులు ఇవ్వవు. పర్సనల్ లోన్లపై ఇచ్చే అమౌంట్.. మీ నెలసరి ఆదాయం, క్రెడిట్, రీపేమెంట్స్, కెపాసిటీ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్లు అధిక వడ్డీ రేట్లతో ఇస్తుంటారు. 
interest rates

బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను 7 శాతంగా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. సేవింగ్స్ అకౌంట్లో కనీస నగదు నిల్వ ఉండేలా తప్పనిసరిగా చూసుకోవాలి. ఒక్కో బ్యాంకులో కనీస నగదు నిల్వ ఒక్కోలా ఉంటుంది. అలాగే వడ్డీ రేటు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది.

సేవింగ్స్ అకౌంట్లో కనీన నగదును నిల్వ చేయని ఖాతాదారుడికి పెనాల్టీలను విధిస్తాయి బ్యాంకులు. కొన్ని చిన్న ఫైనాన్షియల్ బ్యాంకులు సేవింగ్ అకౌంట్లపై మంచి వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇతర టాప్ బ్యాంకులతో పోలిస్తే.. ఫిక్స్ డ్ డిపాజిట్ పై వడ్డీ రేట్లను తక్కువకే ఆఫర్ చేస్తున్నాయి. 

IDFC ఫస్ట్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ :
రూ.లక్ష వరకు 6.00 శాతం వడ్డీ రేటు
> 1లక్షకు పైగా 7.00 శాతం వడ్డీ

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో ఒక్కో ఏడాదికి 1 లక్ష ఆదాయంపై వడ్డీ రేటు 6 శాతంగా అందిస్తోంది. సేవింగ్స్ అకౌంట్లో లక్ష కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు 7 శాతం వడ్డీ ఇస్తోంది. 

Utkarsh చిన్న ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ :
- 25 లక్షల వరకు కనీస నగదు నిల్వపై 7 శాతం వడ్డీ
- ఇంక్రిమెంటల్ బ్యాలెన్స్ రూ. 25 లక్షల పై నుంచి రూ.10 కోట్లు వరకు 7.25 శాతం వడ్డీ
- ఇంక్రిమెంటల్ బ్యాలెన్స్ రూ.10 కోట్లపైనా 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- 25 లక్షల వరకు బ్యాలెన్స్.. 7 శాతంగా వడ్డీ అందిస్తోంది.

Ujjivan చిన్న ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ :
- రూ. 5 లక్షల వరకు 4 శాతం వడ్డీ
- రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 5.50 శాతం వడ్డీ
- రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్లు వరకు 6.75 శాతం వడ్డీ
- రూ. 5 కోట్లకు పైగా 7 శాతం వరకు వడ్డీ
సేవింగ్స్ అకౌంట్లో రూ.5 లక్షల వరకు ఉంచితే 4 శాతం వడ్డీ పొందవచ్చు. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ఉంటే దానిపై 5.50 వడ్డీను ఇస్తోంది. 

అతిపెద్ద స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)లో వడ్డీ రేట్లు రూ.లక్ష లోపు డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీని అఫర్ చేస్తోంది. రూ.1 లక్షకు పైగా సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై ఎస్బీఐ 3 శాతం వడ్డీని అందిస్తోంది. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కూడా ఐదు రెట్లు పెరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 సందర్భంగా.. రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పెంచినట్టు ప్రకటించారు. 

BANK
Savings Account
Interest Rate
latest rates here

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు