మాట నిలబెట్టుకున్నారు : యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ అసెంబ్లీలో తీర్మానం

Submitted on 16 September 2019
ban on uranium mining, telangana assembly motion

సేవ్ నల్లమల విషయంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాటను నిలుపుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అంతేకాదు యురేనియం తవ్వకాల కోసం అన్వేషణను కూడా నిషేధిస్తూ తీర్మానం పెట్టారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం(సెప్టెంబర్ 16,2019) ప్రశ్నోత్తరాల సమయం తర్వాత యురేనియం తవ్వకాలపై చర్చను చేపట్టారు. సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మేరకు నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ తీర్మానం పెట్టారు. యురేనియం అన్వేషణపైనా నిషేధం విధిస్తూ తీర్మానంలో చేర్చారు.

Telangana Assembly
Motion
Uranium mining
ban
Save Nallamala
KTR

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు