a badly behaved home Andhra Pradesh Disha Police Station Home guard

బాలికను గర్భవతి చేసిన దిశ పీఎస్ హోం గార్డు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతేగాకుండా…దిశ పోలీస్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసింది. కానీ దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హోం గార్డు చేసిన నిర్వాకం వెలుగు చూసింది. ఓ బాలికను గర్భవతి చేశాడు ఈ కామాంధుడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. 

మహిళలను రక్షిస్తామని ప్రమాణం చేసిన ఓ పోలీసు..విలన్‌గా మారాడు. 15 ఏళ్ల బాలికపై హోం గార్డు అత్యాచారం చేశాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో…తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా…బాలిక గర్భం దాల్చిందని వైద్యులు చెప్పారు. 

మచిలీపట్నంకు చెందిన ఫణీంద్ర దిశ పీఎస్‌లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల బాలికను ప్రేమ పేరిట లొంగదీసుకున్నాడు. అయితే…గత రెండు రోజులుగా బాలికకు ఆరోగ్యం బాగా లేదు. కడుపునొప్పితో బాధ పడుతోంది. స్థానికంగా ఉన్న మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరిక్షీంచారు.

బాలిక గర్భంతో ఉన్నదని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. అసలు విషయం ఆరా తీయడంతో ఘోరం బయటపడింది. దీనికి కారకుడు ఫణీంద్ర అని బాలిక చెప్పింది. వెంటనే అతడిని తల్లిదండ్రులు నిలదీశారు. తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించయే ప్రయత్నం చేశాడు.

వెంటనే మచిలీపట్నంలోని చిలకలపూడి పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసి ఫణీంద్రను విచారించారు. చివరకు నేరాన్ని ఓప్పుకున్నాడు. ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కృష్ణా జిల్లా ఏఎస్పీ సత్తిబాబు వెల్లడించారు. పది రోజుల్లో శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పారు. 

చట్టంలోని ముఖ్యాంశాలు : – 
* దిశలో రెండు చట్టాలు : 1 ప్రెసిడెంట్ పోవాల్సిన పనిలేదు. రాష్ట్రంలోనే చర్యలతో చట్టం పాస్ అవుతుంది. 2. ప్రెసిడెంట్ దగ్గరకి వెళ్లేది. 
* 13 జిల్లాలకు సంబంధించి..స్పెషల్ కోర్టుల ఏర్పాటు.
* మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల కోసం స్పెషల్ కేటాయింపులు. 
* మహిళపై లైంగిక దాడికి గురైతే..ఆ విషయాన్ని నిరూపించే ఆధారాలు ఉంటే..వెంటనే విచారణ జరిపి..21 రోజుల్లో మరణ శిక్ష. ఐపీసీ సెక్ష‌న్‌లో మార్పులు. 
* 7 వర్కింగ్ డేస్‌లో పూర్తి. (డీఎన్ఏ..అన్నీ ఎవిడేషన్స్ పూర్తి)
* 14 వర్కింగ్ డేస్‌లో ట్రయల్ పూర్తి.

* ఆడవాళ్లు, చిన్నావారిపై వేధింపులు చేస్తే..లైంగిక వేధింపులు జీవిత ఖైదు.
* మహిళలపై సోషల్ మీడియా, ఇతర సామాజిక వేదికలపై వేధింపులు చేస్తే..మొదటిసారి చేస్తే..రెండు సంవత్సరాలు..రెండోసారి చేస్తే..నాలుగు సంవత్సరాల జైలు శిక్ష. 
* నేరాలకు పాల్పడిన వారి వివరాలు డిజిటలైజేషన్. 
* ఫిబ్రవరి 09వ తేదీ నుంచి ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్, IOSలలో అందుబాటులోకి వచ్చింది. 
 

READ  జూబ్లీహిల్స్‌లో బీభత్సం : విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన కారు

See Also>>వాహ్..సాలీడు సోలో టాలెంట్!!.. ఇంజనీర్ కూడా సరిపోడు..

దిశ యాప్ పనిచేస్తుందిలా
* ప్లే స్టోర్‌లోకి వెళ్లి..దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
* యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం ఇంటర్నెట్ ఉన్నా..లేకున్నా వర్క్ చేస్తుంది. 
* ఆపదలో ఉన్న వారు SOS బటన్ నొక్కాలి. వారి ఫోన్ నెంబర్, చిరునామా, వారున్న ప్రదేశం దిశ కంట్రోల్‌ రూంకు చేరుకుంటాయి. 
* బటన్ ప్రెస్ చేసే సమయంలో చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూ..ఇటూ ఊపాల్సి ఉంటుంది. 

* SOS బటన్ నొక్కితే వాయిస్‌తో పాటు..పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్ రూంకు పంపించే అవకాశం ఉంది. 
* కంట్రోల్‌రూంకు సమాచారం అందగానే..అక్కడి నుంచి సమీపంలోని పీఎస్‌‌కు, పోలీస్ రక్షక్ వాహనాలకు ఆటోమెటిక్‌గా కాల్ వెళుతుంది. 
* ప్రమాదంలో ఉన్న వారిని చేరుకోవడానికి జీపీఎస్ అమర్చిన పోలీసు రక్షక్ వాహనాల్లోని మొబైల్ డేటా టెర్మినల్ సహాయ పడుతుంది. 

* సమాచారాన్ని పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు, ఇతరులకు షేర్ చేసుకొనేలా ఐదు ఫోన్ నెంబర్లను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. 
* ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ వినియోగిస్తే..వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల..వారు ప్రయాణీస్తున్న వాహనం ఇతర మార్గాల్లోకి వెళితే..ఆ * సమాచారాన్ని కంట్రోల్ రూం, బంధుమిత్రులకు పంపి అలర్ట్ చేస్తుంది. 

* డయల్ 100, డయల్ 112 నంబర్లను కూడా పొందుపరిచారు. 
* యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు, సమీపంలోని పీఎస్‌ వివరాలు తెలసుకొనేందుకు ఆప్షన్లు కూడా ఉన్నాయి. 
 

Read More >> నిర్భయ కేసు : కుటుంబసభ్యులను కలుస్తారా..? జైలు అధికారుల లేఖ

Related Posts