కరోనా పోరాటానికి ఎవరు ఎక్కువ విరాళమిచ్చారు? టాటానా? అంబానీనా? లేదంటే...అజీమ్ ప్రేమ్ జీనా?

Submitted on 8 April 2020
Azim Premji to Akshay Kumar, the top 10 donors to India's Covid-19 fight

 మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది  ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం.... భారత దేశంలో వ్యవసాయేతర ఉపాధిలో 80 శాతం పైగా ఉన్న శ్రామిక వలస కూలీలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. 

నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం...136 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముంది. అంతేకాదు. వివిధ రంగాల‌పై  ఈ మహమ్మారి ప్రభావం గణనీయంగా  ఉంటుందని చెప్పింది. ఈ వైరస్ సోకిన వ్యక్తులకు, నిర్బంధంలో ఉన్న వారికి అవసరమైన నిత్యావసరాలను ఉత్పత్తి చేయటం ప్రభుత్వానికి, ప్రైవేట్ సంస్ధలకు ఓ సవాల్.

ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 28, 2020న ప్రధాని సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్(PM-CARES) నిధిని ప్రకటించారు. ఏప్రిల్ 3, 2020 నాటికి పీఎం కేర్స్ కు నిధులను ఇచ్చిన టాప్ 10మంది వీళ్లే..

> టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్... పిఎమ్ సహాయ నిధికి రూ.1500 కోట్లు ను ఇచ్చారు. ఈ నిధిని ప్రోటెక్టివ్
Personal protective equipment , టెస్టింగ్ కిట్స్, రోగుల అవసరాలకు ఉపయోగించనున్నారు. 

> అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అండ్ విప్రో ఎంటర్ ప్రైజెస్ రూ.1,125 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ నిధిని మెడికల్ కిట్స్, సామాజిక అవసరాల కోసం ఉపయోగిస్తారు.  

> రిలయన్స్ ఫౌండేషన్ రూ.510 కోట్లును విరాళంగా ఇచ్చింది. వీటిని లక్ష ఫేస్ మాస్కులను తయారు చేయటానికి ఉపయోగించనున్నారు. ఈ నిధులను పిఎమ్ ఫండ్ తో పాటు మహారాష్ట్ర, గుజరాత్ సీఎమ్ ఫండ్స్ కలిపి ఇచ్చారు.

> State oil companiesలు మొత్తంగా రూ.1000 కోట్లు విరాళమిచ్చారు. ఈ నిధుల్లో, వంట గ్యాస్ సరఫరా చేసే ఎవరైనా కోవిడ్‌తో చనిపోతే, వాళ్ల కుటుంబానికి రూ.5లక్షలను ఇవ్వనున్నారు. 

> paytm పిఎమ్ సహాయనిధికి రూ.500 కోట్లు విరాళంగా ఇచ్చింది.

> ITC Limited రూ.150 కోట్లు విరాళంగా ఇచ్చింది.

> Adani Foundation కోవిడ్ 19 సహాయనిదైన పిఎమ్ ఫండ్ కి రూ.100 కోట్లును విరాళంగా ఇచ్చింది.

> జఎస్ డబ్ల్యూ గ్రూప్స్ పిఎమ్ సహాయ నిథికి రూ.100 కోట్లు ను విరాళంగా ఇచ్చింది.

> వేదాంత్ లిమిటెడ్ పిఎమ్ సహాయ నిధికి రూ.100 కోట్లును విరాళంగా ఇచ్చింది. ఈ నిధులను నిత్యావసర సరుకుల కోసం పనిచేసే రోజువారి కూలీలకు, క్రాంటాక్ట్ ఉద్యోగుల కోసం ఉపయోగిస్తుంది.

> బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కూమార్ పిఎమ్ సహాయ నిధికి రూ.25 కోట్లును విరాళంగా ఇచ్చారు.

Azim Premji
Akshay Kumar
donors to India
Covid-19
fight
coronavirus
PM Relief Fund
Contribution
Reliance
Wipro
Paytm
swiggy
ITC
Tata groups

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు