రామజన్మభూమిలోనే రామాలయం : అయోధ్య తీర్పులో కీలక అంశాలు ఇవే

Submitted on 9 November 2019
Ayodhya verdict: Supreme Court gives disputed land to new trust, mosque on alternate land

యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని  రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. తీర్పుని సీజేఐ స్వయంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా తీర్పు సమయంలో ధర్మాసం చేసిన ముఖ్య వాఖ్యలను ఒక్కసారి చూద్దాం.

- రాజకీయాలకు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి
- పురావస్తు నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం
- రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశం
- యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తాం
- రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారు.
- బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉంది. దాన్ని కూల్చారనడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధారాలు చూపించలేదు
- వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ ఓ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోంది.
- మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది.
- శుక్రవారం రోజు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే వక్ఫ్ బోర్డు ఆధారాలు సమర్పించింది.
- వివాదాస్పద స్థలం లోపల ముస్లింలు, బయట హిందువులు ప్రార్థనలు చేసేవారు.
- మసీదు ఎవరు కట్టారో.. ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని అలహాబాద్ హైకోర్టు చెప్పింది.
- మసీదును కర సేవకులు కూల్చివేయడం చట్టవిరుద్ధం
- ఈ కేసుకు ఆర్టికల్ 47వర్తించదు.
- వివాదాస్పద స్థలాన్ని విభజించే ప్రశ్నే లేదు.
- వివాదాస్పదంగా ఉన్న 2.77ఎకరాల స్థలం హిందువులకే.
- స్థల నిర్వహణ, ఆలయ బాధ్యతలు చూసేందుకు కేంద్రం ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటవ్వాలి
- వివాదాస్పద స్థలాన్ని కొత్త ఆలయ ట్రస్టుకు అప్పగించాలి.
- అయోధ్య ట్రస్ట్‌కు మూడు నెలల్లోగా భూమిని అప్పగించాలి.
- అయోధ్యలోనే ముఖ్యమైన స్థలంలో 5 ఎకరాలు ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు ప్రభుత్వం కేటాయించాలి.


 

Ayodhya
Verdict
Supreme Court
DISPUTE LAND
MOSQUE
ALTERNATIVE LAND
PROMINENT PLACE
Temple
prayers
asi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు