జూన్ 25న తెలంగాణలో ఆటోలు బంద్ 

Submitted on 12 June 2019
Autos Bandh on 25th June in Telangana state

సమస్యలు, డిమాండ్ల పరిష్కరం కోరుతూ 2019, జూన్ 25న రాష్ట్రవ్యాప్త ఆటోబంద్‌కు పిలుపునిచ్చారు డ్రైవర్లు, యూనియన్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటోల బంద్ ఉంటుందని ప్రకటించింది ఆటో డ్రైవర్ల జేఏసీ. 

మే నెలలో హత్యకు గురైన ఆటోడ్రైవర్‌ సాయినాథ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంఘం నేతలు. సాయినాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. మద్యం మత్తులో ఆటోడ్రైవర్‌ సాయినాథ్ ను హత్య చేయడంతోపాటు పెట్రోల్‌ పోసి ఆటోను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఆటో డ్రైవర్లు డిమాండ్‌ చేశారు.
 
మంగళవారం (జూన్ 11)హైదర్‌గూడలో  విలేకరుల సమావేశంలో ఆటో డ్రైవర్స్ జేఏసీ నేతలు మాట్లాడారు. హత్యకు గురైనా సాయినాథ్ కుటుంబానికి ఆటోడ్రైవర్లంతా సాయినాథ్‌ ఫ్యామిలీ ఫండ్‌ పేరుతో చందాలు వసూలు చేసి..ఆ మొత్తాన్ని జూన్ 25న సాయినాథ్ కుటుంబానికి అందించనున్నామని జేఏసీ తెలిపింది. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్ల దాడులను సీరియస్ గా తీసుకుని.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Autos Bandh
June 25th
Telangana
Hyedrabad

మరిన్ని వార్తలు