జగన్, చంద్రబాబు చేతులు కలపండి

Submitted on 19 February 2020
asaduddin owaisi call for chandrababu, cm jagan on caa

పార్లమెంటులో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తెచ్చిందని అసద్ ఆరోపించారు. ఏపీలోని విజయవాడలో సీఏఏకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముస్లింలను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టే విధంగా చట్టం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏఏ ఆజాద్ హిందూస్తాన్ కు వ్యతిరేకం అన్నారు. దేశాన్ని ప్రేమించే వారు ఎవరైనా.. సీఏఏని వ్యతిరేకించాలన్నారు. ఈ సభలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాల్గొన్నారు. కాగా, అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు మాత్రం ఈ సభకు దూరంగా ఉన్నారు.

ఏపీ సీఎం జగన్ సీఏఏని వ్యతిరేకించాలని అసద్ పిలుపునిచ్చారు. అలాగే ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఏఏని వ్యతిరేకించాలని, తమ పోరాటంలో కలిసిరావాలని కోరారు. టీడీపీ నేత జలీల్ ఖాన్ పై ఒవైసీ ప్రశంసలు కురిపించారు. జలీల్ ఖాన్ లా ధైర్యంగా చంద్రబాబుతో పాటు అందరూ ముందుకు రావాలని, సీఏఏని వ్యతిరేకించాలని అసద్ కోరారు. ఇది కేవలం ముస్లింల సమస్య మాత్రమే కాదన్న ఒవైసీ.. ప్రతి ఒక్కరు సీఏఏని వ్యతిరేకించాలన్నారు.

ఇది కేవలం ముస్లింల సమస్యగా భావించి సీఎం జగన్ మౌనంగా ఉండిపోతే.. భవిష్యత్తులో బీజేపీ ఇతర మతాలను టార్గెట్ చేస్తూ చట్టాలు తీసుకొచ్చే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. కాగా ఏపీలో సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేసేది లేదని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీలో కనుక సీఏఏ, ఎన్ఆర్సీని అమలు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రకటించారు. సీఏఏని జగన్ ప్రభుత్వం వ్యతిరేకించినా.. కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. దీంతో బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోనుంది అనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సీఏఏని వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయానికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా? లేక ఏమైనా మార్పు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

asaduddin owaisi
Shares
dais
tdp leaders
Ysrcp
Chandrababu
cm jagan
ant caa
Citizenship Amendment Act
Kesineni Nani
jaleel khan
Modi
RSS
BJP
vijayawada
mim

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు