మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?

Submitted on 30 March 2019
Must be Know about 5 SBI charges imposed on you 

మీకు SBI బ్యాంకులో అకౌంట్ ఉందా? మీరు అకౌంట్ లావాదేవీల కోసం sbi ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మీకు తెలియకుండానే బ్యాంకు మీపై చార్జీలు విధిస్తుందని ఎప్పుడైనా గమనించారా? బ్యాంకు అందించే సర్వీసుల్లో మీపై సర్వీసు ఛార్జ్ విధిస్తుందని తెలుసా? ఎస్ బీఐ బ్యాంకు.. తమ కస్టమర్లపై విధించే సర్వీసు ఛార్జీలు ఏంటో ప్రతి కస్టమర్ కు అవగాహన ఉండాల్సిందే. లేదంటే.. అనవసరంగా ఆందోళనకు గురికావాల్సి వస్తుంది. ముందుగానే కస్టమర్లకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు విధిస్తుంది అనేదానిపై కాస్త అవగాహన పెంచుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ఎస్ బీఐ కస్టమర్లకు విధించే 5 ఛార్జీలు ఏంటో ఓసారి లుక్కేద్దాం..
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ

1. కనీస నగదు నిల్వ లేకుంటే : 
ఎస్ బీఐ అకౌంట్ దారులు ఎవరైనా తమ బ్యాంకు అకౌంట్ లో కనీస నగదును నిల్వ చేయాలి. మినిమం అకౌంట్ బ్యాలెన్స్ (MAB) ఉండాల్సిందే. లేదంటే బ్యాంకు సదరు ఖాతాదారుడిపై ఛార్జ్ విధిస్తుంది. ఈ ఛార్జీలు బ్రాంచ్ ఏరియాలను బట్టి మారుతుంటుంది. అంటే.. మెట్రో నగరాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలను అనుగుణంగా ఎస్ బీఐ ఛార్జీలు వర్తిస్తాయి. మెట్రో సెంటర్ బ్రాంచ్ అకౌంట్ దారులు అయితే.. మినమం అకౌంట్ బ్యాలెన్స్ లేకుంటే వారికి నెలకు రూ.50 (జీఎస్టీతో కలిపి) ఛార్జ్ చేస్తుంది. 50శాతం కంటే ఎక్కువగా అకౌంట్ బ్యాలెన్స్ పడిపోతే సదరు రూ.75 వరకు ఛార్జ్ చేస్తుంది. 75శాతం, అంతకంటే ఎక్కువ శాతానికి నగదు నిల్వ పడిపోతే రూ.100 వరకు ఛార్జ్ చేస్తుంది.

i) అర్బన్ బ్రాంచ్ : అర్బన్ సెంటర్ బ్రాంచ్ ల్లో ఎస్ బీఐ అకౌంట్ దారులకు నెలకు జీఎస్టీతో కలిపి నెలకు రూ.40, రూ.60, రూ.80 వరకు
ఛార్జీలు వర్తిస్తాయి. కనీస నగదు నిల్వ చేయకపోతే.. వారికి రూ.3వేల వరకు ఛార్జ్ చేస్తుంది. 

ii) సబ్ అర్బన్ బ్రాంచ్ : కనీస నగదు నిల్వ చేయని అకౌంట్ దారులకు జీఎస్టీతో కలిపి రూ.2వేలు వరకు (నెలకు రూ.25, రూ.50, రూ.75 వరకు) ఛార్జ్ చేస్తుంది.

iii) రూరల్ బ్రాంచ్ : గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్ బీఐ బ్రాంచ్ ఖాతాదారులు కనీస నగదు నిల్వ చేయకుంటే రూ. వెయ్యి వరకు అంటే..( నెలకు  రూ.20, రూ.30, రూ.50 వరకు) ఛార్జ్ చేస్తుంది. 

2. ATM ఛార్జీలు : 
చేతిలో ఎస్ బీఐ ఏటీఎం ఉంది కదా అని ప్రతిసారి ఏటీఎం సెంటర్ దగ్గరకు వెళ్లి అకౌంట్ లో డబ్బులను తెగ విత్ డ్రా చేస్తుంటారు. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తే ఛార్జీలు ఉంటాయని చాలామందికి తెలియదు. ఏటీఎం నుంచి నెలలో 5 ట్రాన్స్ జెక్షన్ లు మాత్రమే ఉచితం. 5కు మించి దాటితే ఛార్జీలు వర్తిస్తాయి. ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్ కు.. జీఎస్టీతో కలిపి రూ.10, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్ కు రూ.5 వరకు ఛార్జ్ చేస్తుంది. గతనెలలో అకౌంట్ లో రూ.25వేల వరకు మినమం అకౌంట్ బ్యాలెన్స్ ఉంటేనే ఈ ఛార్జ్ వర్తిస్తుంది. ఒకవేళ కస్టమర్ అకౌంట్ లో రూ.25వేలకు పైగా నగదు నిల్వ ఉంటే మాత్రం.. ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు ఉండవు.

మెట్రో సెంటర్లు : ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఎస్ బీఐ ఏటీఎం కార్డుతో విత్ డ్రా చేస్తే.. రూ.20 (ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్), నాన్ ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్ కు రూ.8 వరకు ఛార్జ్ చేస్తుంది. (మెట్రో సిటీల్లో నెలకు 3 సార్లు ఉచితం.. నాన్ మెట్రో సిటీల్లో అయితే 5 సార్లు ఉచితం) ఎలాంటి ఛార్జీలు వర్తించవు. అది కూడా కస్టమర్ గత నెలలో తన అకౌంట్ లో మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.1 లక్ష వరకు ఉంటేనే. ఇలాంటి కస్టమర్లకు ఇతర ఏటీఎంల్లో విత్ డ్రా చేసిన ఎలాంటి ఛార్జీలు వర్తించవు.    

3. Check Book జారీ చేసినప్పుడు : 
 ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్ బీఐ అకౌంట్ దారుడు క్వార్టర్లీ యావరేజ్ బ్యాలెన్స్ (QAB)తో రూ.1 లక్ష వరకు కనీస నగదు నిల్వ ఉంచితే.. తొలిసారి 25 చెక్ లీవ్స్ ను ఉచితంగా బ్యాంకు అందిస్తుంది. ఆ తర్వాత నుంచి 10చెక్ లీవ్ లకు రూ.30, 25 చెక్ లీవ్ లకు రూ.75, 50 చెక్ లీవ్ లకు రూ.150 (జీఎస్టీతో కలిపి) ఛార్జ్ చేస్తుంది. QAB రూ.1లక్ష.. అంతకంటే ఎక్కువ నగదు అకౌంట్ లో ఉన్న సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ జారీ విషయంలో ఎలాంటి ఛార్జీలు ఉండవు. 

4. చెక్ రిటర్న్డ్ ఛార్జీలు : 
చెక్ రిటర్న్డ్ ఛార్జీలు జీఎస్టీతో కలిపి ఎస్ బీఐ రూ.500 వరకు ఛార్జ్ చేస్తుంది. అకౌంట్ లో తగినంత డబ్బులు లేకుండా చెక్ డ్రా చేసిన పక్షంలో అది బౌన్స్ అయితే మాత్రం.. ఎస్ బీఐ బ్యాంకు చెక్ రిటర్న్డ్ ఛార్జీలను విధిస్తుంది. ఒకవేళ సాంకేతిక కారణాలతో చెక్ రిటర్న్ అయితే మాత్రం జీఎస్టీతో కలిపి రూ.150 ఛార్జ్ చేస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. టెక్నికల్ రీజన్ కు మాత్రం చెక్ రిటర్న్ ఛార్జీలు ఉండవు. (ఎందుకంటే.. ఇందులో కస్టమర్ తప్పిదం లేదని)

5. DD ఛార్జీలు : 
డిమాండ్ డ్రాఫ్ట్ లు, బ్యాంకర్ల చెక్ లు జారీ చేసినప్పుడు (ఆఫీసు ఇంటర్నల్ డీడీలు)లపై జీఎస్టీలతో కలిపి రూ.25 వరకు ఛార్జ్ చేస్తుంది. ఎస్ బీఐ బ్యాంకు నుంచి తీసే DD రూ.5వేలు వరకు ఉంటే రూ.25, రూ.5వేలు నుంచి రూ.10వేలు ఉంటే.. రూ.50 జీఎస్టీతో ఛార్జ్ చేస్తుంది. రూ.10వేలు నుంచి రూ.లక్ష వరకు డీడీలపై ఒక్కో వెయ్యికి రూ.5 చొప్పున జీఎస్టీతో కలిపి ఛార్జ్ అవుతుంది. రూ.లక్షకు పైగా డీడీ తీస్తే.. జీఎస్టీతో కలిపి ఒక వెయ్యికి (కనిష్టంగా రూ.600, గరిష్టంగా రూ.2వేలు) రూ.4 చొప్పున ఛార్జ్ చేస్తుంది.  
Read Also : ఐపిఎల్-2019: నేడు రెండు మ్యాచ్‌లు.. గెలిచేదెవరు?

SBI customer
5 SBI charges
DD
ATM Withdraw
Minimum Account Balance
Janmabhoomi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు