ys-jagan-mohan-reddy-inaugurate-jagan-anna-vidyadevana-full-fee-reimbursement-scheme

‘జగనన్న విద్యాదీవెన’ పూర్తి ఫీజు రీయింబర్స్ పథకానికి శ్రీకారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ‘జగనన్న విద్యా దీవెన’ను మంగళవారం ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌ చేసే పథకం ఇది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవేలా సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించడంతో పాటు, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులనూ ప్రభుత్వం విడుదల చేసింది. 2018–19 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన రూ.1,880 కోట్లను టీడీపీ సర్కారు చెల్లించలేదు. ఆ బకాయిలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాలేజీలకు విడుదల చేసింది. 2019–20 విద్యా సంవత్సరానికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూడా విడుదల చేసింది. ఈ రెండేళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ.4వేల కోట్లు విడుదల చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఒకేసారి ఇంత పెద్ద మొత్తం విడుదల చేయడం చరిత్రలో ఎన్నడూలేదు. విద్యార్థుల భవిష్యత్‌పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఇందుకు నిదర్శనమని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని అంటున్నారు. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే.. ఆ మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా తిరిగి ఇచ్చేసేందుకు కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. 2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా కట్టి ఉంటే.. ఆ సొమ్మును కూడా తిరిగి రాబట్టుకోవాలని తెలిపింది. 

 

రానున్న విద్యా సంవత్సరం 2020–21లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా డబ్బు వేయనున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా కాలేజీలకు వెళ్లడం, ఫీజులు నేరుగా చెల్లించడంవల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి ఆరా తీయడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Related Posts