This Woman Is Behind Vaccine That May End COVID-19 Pandemic And Save The World

ప్రపంచంలో కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ వెనుకున్న ఈ మహిళ ఎవరంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతోంది. కొవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ప్రారంభించబోతున్నట్టు భారతీయ సీరమ్ ఇన్సిట్యూట్ ప్రకటించింది. ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వ్యాక్సీన్‌కు సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి రూ.1000లకే కరోనా వ్యాక్సీన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అన్నిఅనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారం జరిగి హ్యుమన్ ట్రయల్స్ విజయవంతమైతే.. ఎట్టకేలకు కొవిడ్-19 మహమ్మారిని ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించవచ్చు. 

ఆక్స్ ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో  Indian Council for Medical Research (ICMR) వెనుక ఉండి నడిపిస్తోంది. ChAdOx1 adenovirus వ్యాక్సిన్ ప్రక్రియను దగ్గరుండి నిశితంగా పర్యవేక్షిస్తోంది ఐసీఎంఆర్. కరోనా వైరస్ నిర్మూలనపై పనిచేస్తున్న రీసెర్చర్లలో  యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్‌లో ప్రొఫెసర్ ఆఫ్ వ్యాక్సినాలజీ, వ్యాక్సినాలిజిస్ట్ Sarah Catherine Gilbert అనే మహిళ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు.. వ్యాక్సీన్ కనిపెట్టడంలో ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయం. Gilbert నిరంతర ప్రయత్నం, కఠినమైన శ్రమ, సాయం లేకుండా ఈ వ్యాక్సీన్ తయారీకి ఇదంతా సాధ్యమయ్యేది కాదని మిగితా రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. తన పరిశోధక బృందంతో కలిసి కరోనాను మట్టుబెట్టేందుకు వ్యాక్సీన్ అభివృద్ధిలో ఆమె చేస్తున్న కృషికి అందరూ జేజేలు కొడుతున్నారు. 

Sarah Gilbert ఎవరు? ఆమె విద్యార్హతలు ఏంటి? :
సారా గిల్బర్ట్ అనే ఈ మహిళ.. బాల్యంలో విద్యాభ్యాసాన్ని Kettering High School లో పూర్తి చేసింది. అప్పటినుంచి మందులను కనిపెట్టే రంగంలో పనిచేయాలనుకునేది. బ్యాచిలర్ డిగ్రీని University of East Anglia నుంచి Biological Sciencesలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత University of Hull నుంచి డాక్టరల్ డిగ్రీని పూర్తి చేసింది. అక్కడే genetics and biochemistry of yeast Rhodospordium toruloides స్టడీపై దృష్టిపెట్టింది గిల్బర్ట్. ఈమెకు మెడిసిన్ ఫిల్డ్ అంటే చాలా ఇష్టం. ఎన్నో పరిశోధనలు చేసిన అనుభవం ఆమె సొంతం… అదే ఆమెను కరోనా వ్యాక్సీన్ కనిపెట్టే దిశగా ప్రేరేపించింది. 

గతంలో గిల్బర్ట్ రీసెర్చ్ వర్క్ :
గిల్బర్ట్.. Brewing Industry Research Foundation, Leicester Biocentre వంటి అనేక సంస్థలతో కలిసి పనిచేసింది. ఆమె 2010లో జెన్నర్ ఇన్స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసింది. ఆమె ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్లపై కూడా పనిచేస్తోంది. ప్రత్యేకంగా వైరల్ టీకాల అభివృద్ధి, ముందస్తు పరీక్షతోపాటు ఇన్ఫ్లుఎంజాను ప్రత్యేకంగా ప్రభావితం చేసే T-కణాలను రూపొందించడానికి రోగనిరోధక శక్తిని ప్రేరేపించిన యూనివర్సల్ ఫ్లూ వ్యాక్సిన్ అభివృద్ధిలో కూడా గిల్బర్ట్ పాల్గొంది.

COVID-19 వ్యాక్సిన్‌పై సారా గిల్బర్ట్ వర్కింగ్ :
COVID-19 (జనవరి 10న)  పూర్తి జన్యు శ్రేణిని చైనా విడుదల చేసిన వెంటనే గిల్బర్ట్.. తన పరిశోధక బృందంతో కలిసి వ్యాక్సిన్‌పై పనిచేయడం ప్రారంభించింది. అడెనోవైరల్ వెక్టర్ ChAdOx1 కోసం తన పరిశోధనను అమలు చేసింది. ఎలుకలలో MERS కరోనావైరస్ (మధ్యప్రాచ్యంలో వినాశనం సృష్టించింది)కు వ్యతిరేకంగా విజయవంతంగా నిరూపించింది. 

నిపా వైరస్‌ నిర్మూలన కోసం వ్యాక్సిన్లను రూపొందించడానికి పరిశోధకులు ఈ vector పరీక్షించారు. చిట్టెలుకలపై చేసిన ప్రయోగంపై విజయం సాధించింది. కానీ హ్యుమన్ ట్రయల్స్ వెళ్ళే అవకాశం ఎప్పుడూ రాలేదు. COVID-19లో, COVID-19 స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడానికి ఆమె అడెనోవైరల్ వెక్టర్‌ను ఉపయోగిస్తోంది. ఆండ్రీ పొలార్డ్, తెరెసా లాంబే, కేథరీన్ గ్రీన్, శాండీ డగ్లస్  అడ్రియన్ హిల్‌లతో కలిసి వ్యాక్సిన్‌ను గిల్బర్ట్ అభివృద్ధి చేస్తోంది. 
injection

జనవరిలోనే దాదాపు మూడు నెలల పాటు వ్యాక్సీన్ కోసం ప్రయోగాలు జరుపుతోంది. ప్రస్తుతం హ్యుమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. తొలి దశలో పాల్గొనే 550 మందిపై ట్రయల్స్ లో భాగంగా ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్లు ఇంజెక్ట్ చేయనున్నారు. ప్రొఫెసర్ గిల్బర్ట్.. గతంలోనూ ఇలాంటి వ్యాక్సిన్లు 80 శాతం మేర విజయం సాధించినట్టు విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎంతో విశ్వాసంతో ఉన్నట్టు తెలిపారు. ఈ తరహా టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఆ కోణంలోనే బలంగా చెప్పగలుగుతున్నాని ధీమా వ్యక్తం చేశారు. MERS వ్యాక్సిన్ ట్రయల్స్ లోనూ తాను వర్క్ చేసినట్టు చెప్పకొచ్చారు. 

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 పోరాడేందుకు 70 వరకు వ్యాక్సీన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. కానీ, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై నమ్మకంతో పనిచేస్తున్నట్టు సారా గిల్బర్ట్ తెలిపారు. ఊహించినట్టుగానే అన్ని అనుకున్నట్టుగా సక్సెస్ అయితే కొవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది 2020 సెప్టెంబర్ నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.