virus-likely-keep-coming-back-each-year-say-top-chinese-scientists

కరోనా వైరస్‌ను నిర్మూలించలేం.. ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది : టాప్ చైనా సైంటిస్టుల హెచ్చరిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొత్త కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించలేమని చైనా టాప్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతి ఏడాదిలోనూ ఇతర ఫ్లూల మాదిరిగానే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 17 ఏళ్ల క్రితం ప్రబలిన SARS వైరస్ మాదిరిగా ఈ వైరస్ అంతమైపోయేది కాదన్నారు. జ్వరం వంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా ఒకరినుంచి మరొకరి వేగంగా వ్యాపిస్తుందని చెప్పారు. ఈ గ్రూపును అసింపథిటిక్ (లక్షణ రహిత) వాహకాలుగా పిలుస్తారు. ఇలాంటివారి నుంచి వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో గుర్తించలేమని చైనీస్ వైరల్ గ్రూపు, మెడికల్ రీసెర్చర్లు బీజింగ్ మీడియాకు వివరించారు. 

SARS వ్యాధి సోకిన వారంతా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. ఇతరుల నుంచి ఒకసారి వారిని క్వారంటైన్ చేసినప్పుడు.. వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. దీనికి విరుద్దంగా కరోనా లక్షణాలు ఉంటాయి. కరోనాను నియంత్రణలోకి తెచ్చినప్పటికీ చైనా ప్రతిరోజు కనిపించని లక్షణాలు కలిగిన డజన్ల కొద్ది బాధితులను ఇంకా గుర్తిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి మానువులతో పాటు సుదీర్ఘకాలం మనుగడ సాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సీజనల్ వ్యాధుల మాదిరిగానే మానవుల శరీరంపై ఈ వైరస్ ప్రభావం చూపిస్తునే ఉంటుందని చైనాలోని టాప్ మెడికల్ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్ లోని చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, Institute of Pathogen Biology డైరెక్టర్  Jin Qi స్పష్టం చేశారు. వేసవి కాలంలో కరోనా కేసులు తగ్గుతాయని కచ్చితంగా చెప్పలేమని చైనా నిపుణుడు ఒకరు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఈ కరోనా వైరస్ పూర్తిగా అంతమైపోయే అవకాశం లేదని టాప్ రీసెర్చర్లు, ప్రభుత్వాలన్నీ ఏకాభిప్రాయంతో చెబుతున్నాయి. లాక్ డౌన్ దెబ్బకు గ్లోబల్ ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటోంది. యువ జనాభా ఎక్కువ ఉన్న భారతదేశం, స్వీడన్ దేశాల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కఠినమైన లాక్ డౌన్ అమలు చేస్తున్నాయని కొంతమంది ప్రజా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.