పరుగులు పెట్టిన టూరిస్టులు: హిమాచల్ రోడ్డుపై విరిగి పడ్డ మంచు కొండ

Submitted on 14 January 2020
Video of man hugging and kissing pride of lions goes viral. Internet is in shock

ఉన్నట్టుండి ఒకేసారి హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుకొండ రోడ్డుపై పడిపోవడంతో టూరిస్టులు భయాందోళనలకు గురయ్యారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఈ హఠాన్పరిణామానికి షాక్ అయి వెనుకకు పరుగులు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లోని టింకూ నల్లాకు దగ్గరి ప్రాంతమైన పూహ్‌లో ఈ ఘటన జరిగింది. 

ఈ ఘటనను నవీద్ అనే ఐఆర్ఎస్ ఆఫీసర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మంచు కూలడాన్ని మామూలుగా భావించి వీడియోలు తీసుకుంటున్న టూరిస్టులంతా చివరకు భయపడి పరుగులు పెట్టారు. ఈ వీడియోలో మంచు రోడ్డు మీదకు జారుతుండటం చూడొచ్చు. ఇదే ఘటనను కొందరు టూరిస్టులు  తమ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. 

కాస్త విరిగిపడుతుందని ఊహించిన వారికి మంచుకొండ పడుతూ ఉండడం పెరుగుతూ వచ్చింది. వారంతా గో బ్యాక్.. గో బ్యాక్ అని అరుచుకుంటూ పరుగులు పెట్టారు. కొందరు కారెక్కి పారిపోతుంటే మరికొందరు వీడియోలు రికార్డు చేసుకుంటూ నిల్చొన్నారు. 

కూలడం పూర్తయి పోయిన తర్వాత ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇలా మంచు కూలడం నిజంగా చూడటం ఇదే తొలిసారి అని పొంగిపోయారు. వాతావరణ మార్పులు ఇంత త్వరగా ఉంటాయని ఇప్పుడే తెలిసిందని వెల్లడించారు. ఆ మంచుకొండ కరిగి దాదాపు 2నిమిషాల పాటు ముందుకు వస్తూనే ఉంది. ఈ ఘటనను చిత్రీకిరంచడమే కాకుండా ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. 

Camera
tourists
AVALANCHE
Himachal Road
Himachal

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు