మద్యం దొరక్క నిద్రమాత్రలు మింగిన మనోరమ కొడుకు

Submitted on 9 April 2020
veteran actress manoramas son bhoopathi consumes sleeping pills

కరోనా మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల కోసం తప్పితే ప్రజలు బయటకు రావడంలేదు. అకారణంగా రోడ్లమీద తిరిగితే పోలీసులు రోటి పచ్చడి చేస్తారనే భయం కూడా జనాల్లో లేకపోలేదు. ఇక మందు బాబుల పరిస్థితి వర్ణనాతీతం అనే చెప్పాలి. బుక్కెడు బ్రాందీ దొరక్క అల్లాడిపోతున్నారు మద్యం ప్రియులు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రముఖ నటి మనోరమ తనయుడు మద్యం దొరక్క నిద్రమాత్రలు మింగిన ఘటన తమిళనాట సంచలనంగా మారింది. భూపతి స్థానిక టీనగర్‌లోని నీలకంఠం మెహతా వీధిలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఆయనకి మద్యపానం అలవాటు ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో భూపతికి మద్యం లభించకపోవడంతో మోతాదుకి మించి నిద్రమాత్రలు మింగారు.

Read Also : రాజీకొస్తే రేటు పెంచుతానన్నాడు..

కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై భూపతి కుమారుడు రాజరాజన్‌ మాట్లాడుతూ.. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన విషయం వాస్తవమేనని.. అయితే, మద్యం అలవాటు ఉన్న ఆయన మత్తు కోసం మాత్ర నిద్ర మాత్రలు వేసుకున్నారని, ఆత్మహత్యాయత్నం కాదన్నారు. దయచేసి ఎలాంటి వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. మనోరమ 2015లో కన్నుమూశారు.

coronavirus
Covid-19
LOCKDOWN
manoramas
bhoopathi
Son
sleeping pills
Kollywood
Tamil Nadu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు