సినీ రచయితల సంఘం రజతోత్సవ వేడుకల టీజర్

Submitted on 19 October 2019
Telugu Cine Writers Association Silver Jubilee Celebrations Teaser Launch

తెలుగు సినీ రచయితల సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రజతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలియచేయడానికి, రజతోత్సవ వేడుకల టీజర్ లాంచింగ్ కోసం పత్రికా సమావేశం నిర్వహించారు.  

రచయిత్రి బలభద్రపాత్రుని రమణి స్వాగతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు సంఘం తొలినాటి విశేషాలను వివరించారు. అధ్యక్షుడు డా. పరుచూరి గోపాలకృష్ణ సంఘం కార్యకలాపాలు, నవంబరు 3న ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో జరగబోతున్న రచయితల సంఘం రజతోత్సవ విశేషాలని వివరించారు.

అగ్ర రచయితలు దశాబ్దాల వారీగా తెలుగు సినిమా రచనల గూర్చి రచయితల గొప్పదనం గూర్చి ప్రసంగించారు. 1932 దశకం నుంచి ఈ దశకం వరకు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తుచేసుకున్నారు. సీనియర్ నటులు కృష్ణంరాజు, నాగబాల సురేష్‌, వడ్డేపల్లి కృష్ణమూర్తి, చిలుకుమార్‌ నటరాజ్‌, ఉమర్జీ అనూరాధ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  
  

Telugu Cine Writers Association Silver Jubilee
Rajathotsavam
Rajathotsava Celebrations

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు