విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Submitted on 29 August 2019
telangana electricity department jobs to be filled soon

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి త్వరలో ప్రకటనలు జారీచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఉత్తర, దక్షిణ డిస్కంలలో కలిపి 4,553 జూనియర్ లైన్‌మెన్ పోస్టులు, 11,095 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా...ఉత్తర డిస్కంలో ఉన్న ఖాళీల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియ చివరి దశకి వచ్చిందని ఉత్తర డిస్కం సీఎండీ అన్నమనేని గోపాలరావు చెప్పారు. త్వరలో నియామక పత్రాలు అందజేస్తామని  తెలిపారు. ఇక దక్షిణ డిస్కం పరిధిలో ఉన్న ఖాళీల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎండీ రఘుమారెడ్డి చెప్పారు.

Telangana
electricity department
jobs
notification

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు