శివ కార్తికేయన్ ‘హీరో’ సెకండ్ లుక్

Submitted on 19 October 2019
Sivakarthikeyan Hero Movie Second Look

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.

రీసెంట్‌గా ‘హీరో’ సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. శివ కార్తికేయన్ మాస్క్‌తో పవర్‌ఫుల్ మ్యాన్‌లా కనిపిస్తున్న పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. భయం లేని ఒక సాధారణ యువకుడు యోధుడిలా మారి అక్రమార్కులపై పోరాటం చేసి.. ప్రజలకు ఎలా సహాయ పడ్డాడు  అనే  పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read Also : అభిమానికి ‘తలైవా’ స్వీట్ వార్నింగ్

విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు)సినిమాకు దర్శకత్వం వహించి ప్రశంసలందుకున్న మిత్రన్ ‘హీరో’ చిత్రాన్ని చాలా బాగా రూపొందిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘హీరో’ విడుదల కానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్.

 

Sivakarthikeyan
Arjun Sarja
Kalyani Priyadarshan
KJR Studios
P S Mithran

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు