సందడి చేస్తున్న సంక్రాంతి పాటలు.. వినేకొద్ది వినాలనేలా.. చూసేకొద్ది చూడాలనిపించేలా!

Submitted on 14 January 2020
Sankranthi Festivel SongS 2020

ధన ధాన్యాలతో.. పిల్లల గలగలలతో.. భోగి పళ్ల తలంటు స్నానాలతో.. రంగుల రంగవల్లులతో.. గొబ్బెమ్మల అలంకారంతో.. హరిదాసుల భజనలతో.. డూడూ బసవన్నల సందళ్ళతో..  కొత్త అల్లుళ్ళకు మర్యాదలు.. దేవాలయాల్లో పూజలు.. ప్రకృతి ప్రసాదించే సంక్రాంతి శోభకు పొగమంచుతో స్వాగతం పలుకుతున్న ప్రకృతికి వందనం తెలుపుతూ.. సంబరాలలో ఆంధ్ర, తెలంగాణ మునిగి తేలుతున్నాయి. ఇదే సమయంలో ప్రతి ఏడాదిలాగే మంచి మంచి సంక్రాంతి ఫోక్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

నిఘ నిఘ అంటూ సాగే పాటతో బుల్లితెర సావిత్రి, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి,  హేమంత మంచుల్లో సూర్యుడు అంటూ మంగ్లీ పాడిన పాటలు సందడి చేస్తున్నాయి. ఈ సంక్రాంతి పాటలు.. వినేకొద్ది వినాలనేలా.. చూసేకొద్ది చూడాలనిపించేలా ఉన్నాయి. నెట్టింట్లో వైరల్ అవుతున్న కొన్ని సంక్రాంతి పాటలు ఇప్పుడు చూద్దాం.. 

హేమంత మంచుల్ల సూరీడూ ఏడుగుర్రాలెక్కి వచ్చాడూ:

ఊపు తెప్పించే లిరిక్స్.. స్టెప్పులు వేయించే మ్యూజిక్‌తో వినేకొద్ది వినాలనిపించేలా మంగ్లీ పాడిన పాట 'హేమంత మంచుల్ల సూరీడూ ఏడుగుర్రాలెక్కి వచ్చాడూ'. మంచి మంచి లొకేషన్లలో ఎంతో అందంగా ఈ పాటను రూపొందించారు. ఈ పాట చాలా బాగుంది. ఈ పాటను దాము రెడ్డి చిత్రీకరించారు. సమర్పణ మంగ్లీనే. ఈ సంక్రాంతికి వినదగిన పాటల్లో ఇది ఒకటి. కాసర్ల శ్యాం ఈ పాట రాయగా.. మంగ్లీ పాడింది. కొత్త అల్లుళ్ల గురించి.. రంగవళ్లుల గురించి.. గొబ్బెమ్మల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సాహిత్యంతో చాలా బాగుంది ఈ పాట. చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది.

నిగ నిగ నిగ సంక్రాంతి:
నిగ నిగ నిగ సంక్రాంతి అంటూ సాగే పాటను మిట్టపల్లి సురేందర్‌ రాశారు. ఈ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. అల ప్రొడక్షన్‌ సమర్పణలో సింగర్‌ సాహితీ చాగంటి ఈ పాటను పాడగా.. బుల్లితెర సావిత్రి, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి ఈ పాటలో నటించారు.దీనికి మ్యూజిక్‌ మదీన్‌ ఎస్‌కే అందించారు.  ‘నిగనిగనిగ నెగడు నుండి పుట్టిన కాంతి సంక్రాంతి. ధగధగధగ మెడలో నగలను మించిన కాంతి సంక్రాంతి’ అంటూ సాగే పాట ఈ సంక్రాంతికి వినగల, చూడగల ఫోక్ సాంగ్స్‌లో ఒకటి. 

యేటి గట్టు పక్కన పచ్చని పైరు ఊగేనంట:
'యేటి గట్టు పక్కన పచ్చని పైరు ఊగేనంట నీలి ఆకాశనా గాలి పాటాలా సందడులంటా నేల వాక్కిళ్ళన్ని రంగులు పొంగే సంక్రాంతి పండగ వచ్చే' అంటూ శ్రావణ భార్గవి పాడిన పాట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. సత్యసాగర్‌ సాహిత్యం అందించగా, సంగీతం సమకూర్చిన ఆ పాటను భార్గవితో కలిసి సాయి చరణ్‌ చక్కగా పాడారు.


రానే వచ్చింది హంగులతో:
మ్యాంగో మ్యూజిక్‌ సమర్పణలో సంక్రాంతికి వచ్చిన చక్కని పాట 'రానే వచ్చింది సంక్రాంతి హంగులతో..' పండగ వైభవం మొత్తం ఒక్క పాటలో వచ్చేలా రూపొందించిన సాంగ్ ఇది. ‘రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈ నాడే సంక్రాంతి’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటను  సింగర్‌ మధుప్రియ పాడగా.. కమల్‌ హరిపురం పాటకు దర్శకత్వం వహించారు. పుండరీక అందించిన సాహిత్యం పాటకు హైలెట్ కాగా.. బోలే శావలి మ్యూజిక్ అందించారు. 

వసంతం వాకిట నిలిచి:
జానపద గాయని తేలు విజయ పాడిన పాట 'వసంతం వాకిట నిలిచి'.  ఎస్‌టీవీ ఆడియోస్‌ అండ్‌ వీడియోస్‌ సమర్పణలో తైదల అంజయ్య దీనికి లిరిక్స్ అందించగా.. మ్యూజిక్‌ శ్రీకాంత్‌ అందించారు. 

Sankranthi Festivel SongS 2020
Mangli
Savithri
Madhu Priya
Sravana Bhargavi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు