Researchers Say Herd Immunity Could Actually Work in Countries Like India

కరోనా నిర్మూలనకు భారత్ లాంటి దేశాల్లో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ నిజంగా సాధ్యమే అంటున్న సైంటిస్టులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీతో నియంత్రించడం సాధ్యమవుతుందని పలువురు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు లేదా కరోనాను నయం చేసేందుకు రీసెర్చర్లు రాత్రింబవళ్లూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కరోనాను తాత్కాలికంగా నియంత్రించేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ తమ దేశ ప్రజలను రక్షించేందుకు లాక్ డౌన్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి హెర్డ్ ఇమ్యూనిటీతో సాధ్యమేనంటూ ఓ వ్యూహాత్మక ఆలోచన తెరపైకి వచ్చింది. ఇంతకీ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలుసా? ఒకసారి కరోనా వైరస్ సోకి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిలో హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. రెండోసారి అదే వ్యక్తికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉండదు. ఇలా రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్ వ్యాప్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది.

అత్యధిక జనాభా గల దేశాల్లో కరోనా వైరస్ తీవ్రతను నియంత్రించడంలో విఫలమైతే లక్షలాది ప్రాణాలను వైరస్ బలిగొనే ముప్పు ఉందని ఒకవైపు సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అత్యంత జనాభా గల భారతదేశం లాంటి దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ అద్భుతంగా పనిచేస్తుందని రీసెర్చర్లు అంటున్నారు. ఇప్పటివరకూ కేవలం సామాజిక దూరం, లాక్ డౌన్ వంటి చర్యలతోనే కరోనాను కట్టడి చేస్తున్న ప్రపంచ దేశాలకు ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఎంతవరకు పనిచేస్తుంది అనేదానిపై సందిగ్ధత నెలకొంది. హెర్డ్ ఇమ్యూనిటీ కలిగిన దేశాల్లో కరోనా వైరస్ సోకినప్పటీకి అక్కడి జనాభాలో హెర్త్ ఇమ్యూనిటీ కారణంగా వారిలో యాండీబాడీస్ తయారై కరోనాను నిర్మూలించడం సాధ్యపడుతుందని అంటున్నారు.

స్వీడెన్, యూకే వంటి దేశాల్లో వైరస్‌ను తట్టుకోగల రోగనిరోధక వ్యవస్థ డెవలప్ అయి తొందరగా కోలుకోవచ్చునని అంటున్నారు. ఇప్పటికే స్వీడెన్‌లో ఈ హెర్డ్ ఇమ్యూనిటీని (మంద రోగ నిరోధక శక్తి) అమలు చేయగా, ఇది సమర్థవంతగా పనిచేస్తుందని ఎపిడిమోలిజిస్ట్‌లు చెబుతున్నారు. మరికొన్ని దేశాలు మాత్రం ఈ తరహా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

హెర్డ్ ఇమ్యూనిటీ విధానం చాలా ప్రాణాంతకమైందని, భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. న్యూఢిల్లీ, వాషింగ్టన్‌లోని ఆధారిత పబ్లిక్ హెల్త్ అడ్వోకేసీ గ్రూపుకు చెందిన Princeton University, Center for Disease Dynamics, Economics Policy (CDDEP)లో పరిశోధకులు హెర్డ్ ఇమ్యూనిటీ ప్రశ్నార్థక వ్యూహాం భారతదేశం లాంటి దేశంలో వాస్తవంగా పనిచేస్తుందని అంటున్నారు. యువ జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా మరణాలు, ఆస్పత్రిల్లో చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

సుదీర్ఘ కాలంపాటు ఏ దేశం కూడా లాక్ డౌన్ అమలు చేయలేరు. అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో సుదీర్ఘ లాక్‌డౌన్ భరించలేదని ప్రముఖ భారతీయ ఎపిడిమోలాజిస్ట్ బ్లూమ్ బెర్గ్‌కు తెలిపారు. హెర్డ్ ఇమ్యూనిటీ తగినంత స్థాయికి చేరిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నిలిచిపోతుందని, వృద్ధులు సైతం సురక్షితంగా బయటపడతారని పరిశోధకుల్లో Muliyil అనే పరిశోధకుడు తెలిపారు. నవంబర్ నాటికి కనీసం 60 శాతం జనాభాలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. అయినప్పటికీ ఇది ఎలాంటి మరణాలకు దారితీయదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల్లో 93.5 శాతం మంది 65ఏళ్ల లోపే ఉన్నారని, వైరస్ వ్యాప్తి మరణాలు ఆటోమాటిక్‍‌గా తగ్గిపోతాయని అంటున్నారు. భారతదేశంలాగా ఇండోనేషియా, సబ్ శాహ్రాన్ ఆఫ్రికా దేశాల్లోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు.

అత్యధిక జనాభా కలిగిన ఈ దేశాల్లో సామాజిక దూరం వంటి పాటించడం కష్టమైన చర్యగా పేర్కొన్నారు. లక్షలకు పైగా టెస్టింగ్ కిట్స్ అవసరంతో పాటు లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం తప్పక ఉంటుందని రీసెర్చర్లు తెలిపారు. Princeton, CDDEP బృందం సిఫార్సు చేస్తున్న ఈ సిద్ధాంతం ప్రకారం.. మే3 వరకు విధించిన కఠినమైన లాక్ డౌన్ భారత్ ఎత్తేస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయి అనేదానిపై వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే 60 ఏళ్ల లోపు వారంతా బయటకు రావడం అంతా సాధారణ స్థితికి మానవ జీవనశైలి మారిపోతుంది.

ఎక్కువ సంఖ్యలో గుమికూడటం, సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌ల వంటి ప్రాముఖ్యతను ప్రభుత్వాలు నొక్కి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లాక్ డౌన్ తర్వాత కూడా కరోనా లక్షణాలు బయటపడిన వారికి టెస్టింగ్ చేయడం.. బాధితులను గుర్తించడం, ఐసోలేషన్ చేయడం, సినీయర్ సిటిజన్లు ఇంట్లోనే క్వారంటైన్ ఉండేలా చర్యలు చేపట్టాలి. ప్రాధాన్యతను బట్టి బాధితులకు టెస్టింగ్ లు చేయడం, చికిత్స అందించడం చేయాల్సి ఉంటుంది.

మరోవైపు విమర్శకులు మాత్రం.. హెర్డ్ ఇమ్యూనిటీ వ్యూహాన్ని భారత ప్రభుత్వం అమలు చేయదని స్పష్టం చేశారు. ఆంక్షలతో కూడిన టెస్టింగ్ వంటి చర్యల దిశగానే ముందుకు వెళ్తుంది. ఇదివరకే బ్రిటన్‌ ఈ తరహా వ్యూహాన్ని అమలు చేసింది. కరోనా మరణాలు పరిమితికి మించి నమోదు కావడంతో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో తీవ్రత భయానకంగా ఉంటుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.