దీపావళి సేల్.. డిస్కౌంట్లు : Redmi ఫోన్లపై భారీ తగ్గింపు

Submitted on 14 October 2019
Redmi K20 and Redmi K20 Pro India price drops: Check new price of all variants

భారత మొబైల్ మార్కెట్లలో దీపావళి పండగ సేల్ కొనసాగుతోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్ సహా వివిధ ఈ-కామర్స్ వెబ్ సైట్లలో దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. దీపావళి సేల్ సందర్భంగా దేశ మార్కెట్లో తొలిసారిగా షియోమీ ఇండియా తమ అధికారిక వెబ్ సైట్లో Mi Sale ఆఫర్ చేస్తోంది. Redmi K20, Redmi K20 Pro స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ అందిస్తోంది. అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 17 వరకు Mi Sale కొనసాగనుంది.

10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ :
SBI క్రెడిట్ కార్డు యూజర్లకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ కింద 10 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్ మి కె20, రెడ్ మి కె20 ప్రో.. రెండు వేరియంట్ల ధరలను షియోమీ తగ్గించింది. Redmi K20 Pro మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. (6GB ర్యామ్ + 128GB స్టోరేజీ) ధర రూ.24వేల 999 తగ్గింపు ధరతో లభిస్తోంది. మరో Redmi K20 ప్రో వేరియంట్ (8GB ర్యామ్ + 256GB స్టోరేజీ) మోడల్ ధర రూ.30వేల 999లకే లభిస్తోంది.

ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ లో చౌకైన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ అందిస్తోంది. మరోవైపు.. Redmi K20 మోడల్ ఫోన్ ధర కూడా తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.19వేల 999గా ఉంది. బేసిక్ మోడల్ Redmi K20 ఫోన్ (6GB ర్యామ్ + 128GB స్టోరేజీ) ధర రూ.23వేల 999కే లభిస్తోంది. Redmi K20 ఫోన్ లో చౌకైన స్నాప్ డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం... Mi Saleలో నచ్చిన Redmi మోడల్ సెలక్ట్ చేసి కొనేసుకోండి. 

Redmi K20
Redmi K20 Pro
India price
all variants
Mi Sale

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు