ఎవరు విక్రమ్? ఎవరు వేద?

Submitted on 7 April 2020
Raviteja and Pawan Kalyan to Star in The Vikram Vedha Remake

ఆర్.మాధవన్, విజయ్ సేతుపతి నటించగా తమిళ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్రమ్ వేదా’.. పుష్కర్- గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాధవన్ పోలీస్ ఆఫీసర్‌ విక్రమ్, విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌ వేద పాత్రల్లో నటించారు.

బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. కొద్ది కాలంగా ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ కలిసి ఈ రీమేక్‌లో నటించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.

Read Also : నాగలక్ష్మికి చిరు సాయం.. అదే ఆమె గుండె చప్పుడు..

బాబీ డైరెక్ట్ చేయనున్నాడట. పవన్, రవితేజ ఇద్దరిలో ఎవరు ఏ పాత్ర చేయనున్నారు.. ఈ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారనే విషయంలో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని తెలుస్తోంది. పవన్ ఇప్పటికే ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’, క్రిష్ సినిమాలు చేస్తున్నాడు. హరీష్ శంకర్‌తోనూ సినిమా ఫిక్స్ అయింది. అన్నీ కుదిరితే ‘విక్రమ్ వేద’ రీమేక్ పవన్ నటించే 29వ సినిమా అవుతుంది.

Vikram Vedha

Raviteja
Pawan kalyan
Vikram Vedha
Remake
Kollywood
Tollywood

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు