కేరళ పోలీసుల క్రియేటివిటీ అదుర్స్, నవ్వులు పూయిస్తున్న రవిశాస్త్రి ట్రేసర్ బుల్లెట్

Submitted on 9 April 2020
ravi shastri tracer bullet becomes viral

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. అంతేకాదు సోషల్ డిస్టేన్స్ మస్ట్. కానీ కొన్ని చోట్ల జనాలు లాక్ డౌన్ ని కేర్ చెయ్యడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్నారు. గుంపులు గుంపులుగా ఒక చోట చేరుతున్నారు. ముచ్చట్లు పెడుతున్నారు. దీంతో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాఠీలకు పని చెబుతున్నారు. వీపు విమానం మోత మోగిస్తున్నారు. బడితె పూజలు చేస్తున్నారు. వాహనాలు సీజ్ చేసి భారీగానే ఫైన్లు వేస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు.(కరోనా బాధితుల ఫుడ్ మెనూ ఇదే.. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కోరింది తినొచ్చు!)

లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా:
కేరళ రాష్ట్రంలో ఇలానే కొందరు ఆకతాయిలు లాక్ డౌన్ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. పోలీసులకు తలనొప్పిగా మారారు. దీంతో పోలీసులు వారికి బుద్ది చెప్పేందుకు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపారు. లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.

డ్రోన్ కెమెరాలు చూసి జనాల పరుగులు:
ఒక్కసారిగా డ్రోన్ కెమెరాలు కనిపించడంతో రోడ్లపై ఉన్న ప్రజలు షాక్ తిన్నారు. డ్రోన్ కెమెరా కంటికి చిక్కకుండా పరుగులు తీశారు. ముఖాన్ని షర్టులో దాచుకుని పరిగెత్తారు. కొందరైతే ఏకంగా గోడలు దూకే ప్రయత్నం చేశారు. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో రికార్డు చేసిన వీడియోలను అన్నింటిని కలిపిన కేరళ పోలీసులు వాటిని ఎడిట్‌ చేశారు. దీనికి 2016లో పాపులర్ అయిన రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, ఇయాన్ బోథమ్ ల ట్రేసర్‌ బుల్లెట్‌ చాలెంజ్ కామెంటరీ ఆడియోని జోడించి సోషల్ మీడియలో పోస్టు చేశారు.

ట్రేసర్ బుల్లెట్ కామెంటరీ వాడిన పోలీసులు:
డ్రోన్ కెమెరా కంటపడకుండా ఉండేందుకు ప్రజలు పొలాలు, బీచ్ లు వెంట వేగంగా పరిగెత్తడం కనిపిస్తుంది. కొంతమంది టవల్, లుంగీలతో తమ ముఖాన్ని కప్పుకునేందుకు యత్నించడం, మరికొందరు చెట్టు చాటున దాక్కోవడం వంటి చర్యలు నవ్వులు పూయిస్తున్నాయి. కేరళ పోలీసులు పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకి కేరళ పోలీసులు యాడ్ చేసిన ట్రేసర్ బుల్లెట్ ఆడియో పర్ ఫెక్ట్ గా సరిపోయిందని నెజిటన్లు కామెంట్ చేస్తున్నారు.

వైరల్ గా మారిన వీడియో:
రవిశాస్త్రి గతంలో కామెంటేటర్‌గా ఉండగా ఒక షాట్‌కు ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగిస్తాడు. దీనిని సహచర కామెంటేటర్‌లకు సైతం చాలెంజ్‌ విసురుతాడు. దానికి సునీల్‌ గవాస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ తమ వ్యాఖ్యానంలో ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగిస్తారు. దీన్ని కేరళ పోలీసులు ఉపయోగించుకున్నారు. లాక్‌డౌన్‌ను నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని చెదరగొట్టే క్రమంలో తీసిన డ్రోన్‌ కెమెరా వీడియోకు రవిశాస్త్రి ట్రేసర్‌ బుల్లెట్‌ కామెంటరీని జోడించి ట్విట్టర్‌లో పెట్టారు. కేరళ పోలీసుల క్రియేటివిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు సూపర్ అంటూ కితాబిస్తున్నారు.

ravi shastri
tracer bullet
Kerala Police
drone camers
LOCKDOWN
viral

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు