pranitha-subhash-cooks-food-corona-virus-relief-victims

ఈ ఛాలెంజులు కాదు కావల్సింది.. ప్రేమతో పట్టెడన్నం పెట్టండి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ నేపథ్యంటో సెలబ్రిటీలు బాగానే ఉన్నారు గానీ సామాన్యులు.. మధ్య తరగతి, పేద ప్రజలు మాత్రం నానా ఇబ్బందులూ పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి పలువురు ముందుకొచ్చి ఆహారం, నిత్యావసర వస్తువులు అందచేస్తున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ ప్రణితా తనవంతు సాయమందిస్తూ అందరి మనసులూ దోచుకుంది.

చీమని తొక్కకుండ పక్కకి జరిగినా పబ్లిసిటీ కోరుకునే ఈ రోజుల్లో ఎటువంటి హంగూ ఆర్భాటాలకు ప్రచారాలకు పోకుండా నిండు మనసుతో సేవ చేస్తున్న ప్రణితను అందరూ అభినందిస్తున్నారు. ఇప్పటికే కొంత ఆర్థిక సహాయం ప్రకటించిన ప్రణిత.. లాక్‌డౌన్ కష్టాలు మరింత పెరిగాక పేదలను ఆదుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగింది.

దగ్గరుండి భోజనం వండిస్తూ వాటిని పంపిణీ చేయిస్తోంది. గత 21 రోజుల్లో ఏకంగా 75 వేల మందికి భోజనం పెట్టింది. ప్రణిత మంచితనం నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె నిజమైన సెలబ్రిటీ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సమాజానికి కావాల్సింది పిల్లో ఛాలెంజ్‌లు, రియల్ మేన్ ఛాలెంజ్‌లు కాదు.. ప్రణితలా నిండు మనసుతో పేదలకు పట్టెడన్నం పెట్టే ఛాలెంజ్ కావాలని కామెంట్స్ చేస్తూ ప్రణితకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు.