police arrest man for free liquor distribution

అత్తారింటికి పెగ్గుదాత, లాక్‌డౌన్ వేళ మందుబాబుల మందుదాహం తీర్చిన వ్యక్తి అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరమైనవి మినహా అన్ని

కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరమైనవి మినహా అన్ని రకాల షాపులు, దుకాణాలు మూసేశారు. మందు షాపులు కూడా బంద్ చేశారు. లాక్ డౌన్ తో నిరుపేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో వారి ఆకలి తీర్చేందుకు అన్నదానాలు జరుగుతున్నాయి. ఇది మంచిదే. కానీ ఓ వ్యక్తి చేసిన దానం మాత్రం విమర్శలు దారితీసింది. ఆ వ్యక్తిని జైలు పాలు చేసింది. పోలీసులు ఆ వ్యక్తిని అత్తారింటికి తరలించారు.

మందుబాబుల కష్టాలు చూడలేక లిక్కర్ దానం:
ఇంతకీ ఆ వ్యక్తి ఏం దానం చేశాడో తెలుసా? మందు దానం. అవును.. లాక్ డౌన్ లో మందు దొరక్క పిచ్చెక్కిపోతున్న మందు బాబుల మందు దాహం తీర్చాడు. ఉచితంగా పెగ్గు పోసి మహానుభావుడు అనిపించుకున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని దుకాణాలతో పాటు మద్యం షాపులు కూడా మూతపడి మందు బాబులు నరకం చూస్తున్నారు. ఎర్రగడ్డ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి లిక్కర్ దానానికి పూనుకున్నారు. రోడ్ల పక్కన నివసించే కూలీలు, ఇతరులకు ఉచితంగా మద్యం పంచాడు. వారందరికి ఫ్రీగా ఓ పెగ్గు పోశాడు.

ఒక్కొక్కరికి ఒక పెగ్గు మందు:
హైదరాబాద్ పాతబస్తీ చంపాపేటలో ఈ ఘటన జరిగింది. చంపాపేటలో వైన్స్ షాపుల చుట్టూ తిరుగుతూ ఎప్పుడు మద్యం దుకాణాలు తెరుస్తారని ఎదురుచూస్తున్న మందుబాబులకు కుమార్ అనే స్థానికుడు మందు దానం చేశాడు. ఒక్కో మనిషికి పెగ్గు పోసి వారి మందు దాహాన్ని తీర్చాడు. ఇలా సుమారు 10 ఫుల్ బాటిళ్లు పోసినట్టు సమాచారం. మద్యం దానం అందుకున్న వారిలో మహిళలు కూడా ఉండడం విశేషం. కాగా కుమార్ చేసిన మద్యం దానం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. దీన్ని తీవ్రంగా తప్పుపట్టిన పోలీసులు పెగ్గు దాత కుమార్ ను అరెస్ట్ చేశారు. 

Also Read | అసలేం జరిగింది.. చెట్టుకి ఉరేసుకున్న యువతులు, మేడ్చల్ లో 3 మృతదేహాల మిస్టరీ

Related Posts