టీనేజర్లు నగ్నంగా సెల్ఫీలు దిగాలని చూస్తే.. ఈ ఫోన్ ఒప్పుకోదు! 

Submitted on 20 February 2020
This phone will stop you from sending nudes to anyone

జపాన్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టోన్ మొబైల్ యూనిక్ ఫీచర్ తో కూడిన ఒక ఫోన్ ప్రవేశపెట్టింది. కంపెనీ టోన్ ఆఫర్ చేసే ఈ ఫోన్ టోన్ e20 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. e20 స్మార్ట్ ఫోన్‌లో AI స్పెషల్ యూనిక్ ఫీచర్ తో రూపొందించింది. ఈ AI ఫీచర్.. యూజర్లు ఎవరైనా నగ్నంగా సెల్ఫీలు దిగాలని చూస్తే పట్టేస్తుంది. నగ్న ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటుంది. టోన్ e20 డివైజ్.. ‘స్మార్ట్ ఫోన్ ప్రొటెక్షన్’ ఫీచర్ పేరుతో వస్తోంది.

నగ్న సెల్ఫీల నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేసేందుకు ప్రత్యేకించి ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ AI ఫీచర్.. స్మార్ట్ ఫోన్ కెమెరా సాయంతో పనిచేస్తుంది. ఏదైనా అసభ్యకరమైన ఫొటోను తీసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే పసిగట్టేసి వార్నింగ్ ఇస్తుంది. ఫోన్ కెమెరా ఆ ఫొటోను గుర్తించగానే ఎర్రర్ మెసేజ్‌తో ఫ్లాష్ వస్తుంది.. ఈ ఫొటో మీరు తీయలేరు అంటూ వార్నింగ్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. టోన్ మొబైల్ ఇలాంటి ఫీచర్ తో ఫోన్ ఆవిష్కరించడానికి అసలు కారణాన్ని రివీల్ చేసింది. 

పిల్లలు, యువతీ యువకులను అశ్లీల ఫొటోలు, వీడియోలను రక్షించేందుకు ఈ సరికొత్త AI ఫీచర్ తో కూడిన e20 డివైజ్ రూపొందించినట్టు తెలిపింది. ఎవరైనా ఈ ఫోన్ నుంచి ఇతరుల నగ్న ఫొటోలను తీసేందుకు ప్రయత్నిస్తే వెంటనే వార్నింగ్ ఇస్తుంది.. ఫొటో తీయలేరు కూడా. ఇందులో పేరంటల్ కంట్రోల్స్ యాప్ తో లింక్ అయి ఉంటాయి. పిల్లల్లో ఎవరైనా నగ్నంగా ఫొటోలు దిగేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఈ ఫోన్ డిటెక్ట్ చేసి పేరంట్స్ ను అలర్ట్ చేస్తుంది.

ఈ అలర్ట్.. తేదీ, సమయంతో కూడిన సమాచారాన్ని అందిస్తుంది. GPS వివరాలు కూడా ఫొటో థంబులైన్ పై ఫ్రింట్ చేస్తుంది. టోన్ e20 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకంచి విద్యార్థుల కోసం తీసుకొచ్చినట్టు తెలిపింది. అందుకే ఇందులో ఫోన్ ఫీచర్ ప్రత్యేకంగా రూపొందించినట్టు పేర్కొంది. కానీ, అడల్ట్ యూజర్లు.. ఈ స్మార్ట్ ఫోన్ ప్రొటెక్షన్ ఫీచర్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చుని వెల్లడించింది. టోన్ e20 స్మార్ట్ ఫోన్ ధర 19,800 యాన్స్ (రూ.12,900 సుమారుగా) ఉంటుంది. జపాన్ లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 

ఫీచర్లు + స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.26 అంగుళాల HD+ డిస్‌ప్లే
* 13MP ట్రిపుల్ కెమెరా సెటప్
* ఆండ్రాయిడ్ 9.0 OS
* ఆక్టా కోర్ ప్రాసెసర్
* 64GB బుల్ట్ ఇన్ స్టోరేజీ
* 3,9000mAh బ్యాటరీ

Read More>>OTT పోటీదారులతో పోలిస్తే: అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకేసారి ముగ్గురు చూడొచ్చు!

naked selfie
sending nudes
phone
 AI feature
Tone Mobile
Japanese smartphone brand

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు